Lifestyle: ఉదయం లేవగానే వికారంగా ఉంటుందా.? ఇదే కారణం కావొచ్చు..

మనిషి అనారోగ్యం బారిన పడిన వెంటనే శరీరం కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల ఆధారంగా శరీరం మనల్ని జాగ్రత్తపడమని ముందుగానే అలర్ట్‌ చేస్తుంది. అలాంటి లక్షణాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఉదయం లేవగానే కనిపించే కొన్ని లక్షణాలు మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనలో కొందరికి ఉదయం నిద్రలేచిన వెంటనే వికారం...

Lifestyle: ఉదయం లేవగానే వికారంగా ఉంటుందా.? ఇదే కారణం కావొచ్చు..
Health
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 19, 2024 | 1:00 PM

మనిషి అనారోగ్యం బారిన పడిన వెంటనే శరీరం కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల ఆధారంగా శరీరం మనల్ని జాగ్రత్తపడమని ముందుగానే అలర్ట్‌ చేస్తుంది. అలాంటి లక్షణాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఉదయం లేవగానే కనిపించే కొన్ని లక్షణాలు మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనలో కొందరికి ఉదయం నిద్రలేచిన వెంటనే వికారం, వాంతి భావన కలుగుతుంటాయి. అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కొన్ని రకాల వ్యాధులకు ముందస్తు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉదయం నిద్రలేచిన వెంటనే వాంతి, వికారం కలగడానికి ప్రధాన కారణాల్లో ఒత్తిడి, ఆందోళన ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మీరు ఏదో అంశంపై ఒత్తిడితో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆందోళన ఉన్న వారిలో కడుపులో గడిబిడిగా ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటు అధికంగా ఉన్న వారిలో కూడా ఉదయాన్నే ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. అయితే కేవలం వాంతి వచ్చిన భావన మాత్రమే కలుగుతుంది. కానీ వాంతి మాత్రం రాదు కాబట్టి ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* రక్తపోటు తక్కువగా ఉన్న వారిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. లో బీపీ కారణంగా వికారం, తల తిరగడం, మైకం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. అదే విధంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే లోబీపీ, షుగర్‌ లెవల్స్‌ తగ్గడానికి ముందస్తు లక్షణాలుగా భావించాలి.

* మైగ్రేన్‌ సమస్య ఉన్న వారిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్‌తో బాధపడేవారిలో ఉదయం లేవగానే తీవ్రమైన తలనొప్పితో పాటు వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని అంటున్నారు. తలనొప్పితో పాటు వాంతులు వస్తే కచ్చితంగా మైగ్రేన్‌గా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

* ఇక శరీరంలో సరిపడ నీరు లేకపోయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే వాంతులు వచ్చిన భావన కలిగితే అది డీహైడ్రేషన్‌కు సంకేతంగా భావించాలని అంటున్నారు. మైకం, వాంతులు వంటివి డీహ్రైడేషన్‌కు కారణాలుగా చెప్పొచ్చు. అందుకే సరిపడ నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..