Bath After Funeral: అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
Bath After Funeral: అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారనే విషయం రోజుల్లో చాలా మందికి తెలియదు. ముందు తరాలు చేశారు కాబట్టి.. మనమూ చేయాలనే పద్ధతిలో కొనసాగిస్తున్నారు. అయితే.. ఆచారాలు, సంప్రదాయాలకు మనదేశంలో చాలా విలువ ఇస్తారు. అందుకే హిందూ సాంప్రదాయంలో..

Bath After Funeral: సాధారణంగా ఎవరైనా చనిపోతే వారి వద్ద వెళ్లి చూసి వచ్చాక.. లేదా వారి అంత్యక్రియల్లో పాల్గొంటే వచ్చాయ స్నానం చేయడం అనేది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. తెలిసిన వారు ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్లి వస్తే తప్పకుండా స్నానం చేయాలంటారు పెద్దలు. దీని వెనుక కారణం ఏంటని మీరెప్పుడైనా ఆలోచించారా? ముఖ్యంగా మన పెద్దవారు చనిపోయిన కాడికి వెళ్ళొస్తే స్నానం చేస్తే ఇంట్లోకి రానిస్తారు.అసలు చనిపోయిన వ్యక్తి వద్దకు వెళ్లి వస్తే ఎందుకు స్నానం చేయాలి? స్నానం చేయకుండా ఇంట్లోకి వస్తే ఏమవుతుంది? దీని గురించి తెలుసుకుందాం..
ఈ స్నానం చేయడం ఆచారం వెనుక మతపరమైన ఆచారంతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు జనాలు భయంకర వ్యాధులతో చనిపోయేవారట. మనిషి చనిపోయిన తర్వాత కొన్ని రకాల వ్యాధి కారకాలు శరీరంలో, మృతదేహం చుట్టు ఉంటాయని చెబుతుంటారు. దీని వల్ల మృతదేహాలను చూసేందుకు వచ్చేవారికి ఈ వైరస్‌లు వ్యాపించే అవకాశం ఉందని భావిస్తారు. అయితే స్నానం చేసి వస్తే ఆ హానికర వైరస్‌లు శరీరంలో నుంచి తొలిగిపోతాయని పెద్దలు చెబుతుంటారు. అందువలన అప్పటి నుంచి ఇప్పటి వరకు శవం వద్దకు వెళ్లి వస్తే తప్పనిసరిగా స్నానం చేయాలి అంటారు.
బ్యాక్టీరియా దూరమయ్యేందుకు..
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మనిషి చనిపోయిన తర్వాత మన శరీరంలో బ్యాక్టీరియా తయారవుతుంది. ఆ శరీరాన్ని తాకిన వారికి అది అంటుకుంటుంది. ఈ విషయాన్ని పూర్వకాలంలోనే గుర్తించారు. అందుకే వ్యక్తి చనిపోయన తర్వాత దహన సంస్కారాలు నిర్వహించిన తర్వాత స్నానం చేయాలని చెబుతుంటారు. పూర్వ కాలంలో మశూచి వంటి పలు రకాల వ్యాధులు విజృంభించి వందలాది ప్రాణాలు కోల్పోయేవారట. ఈ రోజుల్లో మందులు గానీ, టీకాలు గానీ ఉండేవి కావు. శవం నుంచి ఆయా రోగాలు ఇతరులకు సోకకుండా ఉండటానికి శవం వద్దకు వెళ్లి వస్తే స్నానం తప్పకుండా చేయాలనే నియమం ఉంది.
నెగెటివ్ ఎనర్జీ నుంచి దూరమయ్యేందుకు..
అలాగే హిందూ సంప్రదాయాల ప్రకారం శ్మశాన వాటికలో నెగెటివ్ ఎనర్జీ ఉంటుందని భావిస్తుంటారు. చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించిన తర్వాత.. ఆ నెగెటివ్ ఎనర్జీ భావనలను మన నుంచి దూరం చేసుకోవడానికి స్నానం చేయాలని చెబుతుంటారు.
ఆచారాలు, సంప్రదాయాలుగా..
అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారనే విషయం రోజుల్లో చాలా మందికి తెలియదు. ముందు తరాలు చేశారు కాబట్టి.. మనమూ చేయాలనే పద్ధతిలో కొనసాగిస్తున్నారు. అయితే.. ఆచారాలు, సంప్రదాయాలకు మనదేశంలో చాలా విలువ ఇస్తారు. అందుకే హిందూ సాంప్రదాయంలో ఈ నియమాలను పాటిస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




