AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

England vs Nepal: టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు ఇంగ్లాండ్‌కు రక్త కన్నీరే..

టీ20 ప్రపంచ కప్ ఐదో మ్యాచ్‌లో నేపాల్‌ టీం ఇంగ్లాండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించింది. ఇంగ్లండ్ అందించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేజ్ చేసేలా అనిపించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఈ మ్యాచ్‌పై ఫోకస్ చేసేలా చేసింది. కానీ, చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నేపాల్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది.

England vs Nepal: టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు ఇంగ్లాండ్‌కు రక్త కన్నీరే..
England Vs Nepal
Venkata Chari
|

Updated on: Feb 08, 2026 | 6:47 PM

Share

టీ20 ప్రపంచ కప్ ఐదో మ్యాచ్‌లో నేపాల్‌ టీం ఇంగ్లాండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించింది. ఇంగ్లండ్ అందించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేజ్ చేసేలా అనిపించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఈ మ్యాచ్‌పై ఫోకస్ చేసేలా చేసింది. కానీ, చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నేపాల్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ 55, హ్యారీ బ్రూక్ 53 పరుగులు చేశారు. నేపాల్ తరపున దీపేంద్ర సింగ్ ఐరీ, నందన్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

చివరి వరకు పోరాడిన నేపాల్.. ఇంగ్లాండ్ జట్టుకు కునుకు లేకుండా చేసింది. పరిస్థితి గమనించి చివరి ఓవర్ బౌలింగ్ చేసిన సామ్ కరణ్.. తన తెలివితేటలతో  చివరి ఓవర్లో నేపాల్ విజయానికి కావాల్సిన 10 పరుగులను ఇవ్వకుండా కేవలం 5 పరుగులే ఇచ్చి టెన్షన్‌కు రిలీఫ్ ఇచ్చాడు. నేపాల్ బ్యాటర్ లోకేష్ తనదైన బ్యాటింగ్‌తో ఒక్కసారిగా ప్రపంచాన్ని తనవైపు చూసేలా చేశాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు చేసి.. ఇంగ్లాండ్ జట్టుకు రక్త కన్నీరు పెట్టించాడు.

గ్రూప్ సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నేపాల్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. లోకేష్ బామ్ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా.. జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. దీపేంద్ర సింగ్ ఐరీ 44 పరుగులు చేశాడు. రోహిత్ పౌడెల్ (39 పరుగులు)తో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. కుశాల్ భూర్టెల్ 29 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ డాసన్ రెండు వికెట్లు పడగొట్టగా, ల్యూక్ వుడ్, జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

రెండు జట్ల ప్లేయింగ్ 11..

ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (wk), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (c), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.

నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్), రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, ఆరిఫ్ షేక్, లోకేష్ బామ్, గుల్షన్ ఝా, కరణ్ కెసి, నందన్ యాదవ్, సందీప్ లామిచానే, షేర్ మల్లా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..