Andhra: ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకో తెలుసా..!
తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలకు హడలెత్తించి.. వారం రోజులపాటు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి.. ఫారెస్ట్ అధికారులకు ముప్పు తిప్పలు పెట్టించి ఎట్టకేలకు చిక్కిన పెద్దపులి.. విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్ -ఏ ఆర్ సి సంరక్షణలో ఉంది. ఆపరేషన్ జాక్ సక్సెస్ అయిన తరువాత... తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురంలో పులిని విజయవంతంగా బంధించి విశాఖ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలకు హడలెత్తించి.. వారం రోజులపాటు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి.. ఫారెస్ట్ అధికారులకు ముప్పు తిప్పలు పెట్టించి ఎట్టకేలకు చిక్కిన పెద్దపులి.. విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్ -ఏ ఆర్ సి సంరక్షణలో ఉంది. ఆపరేషన్ జాక్ సక్సెస్ అయిన తరువాత… తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురంలో పులిని విజయవంతంగా బంధించి విశాఖ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ వెటర్నరీ వైద్యుడు యానిమల్ కీపర్ ల ప్రత్యేక పర్యవేక్షణలో పెద్ద పులిని ఉంచారు. అయితే.. స్వేచ్ఛగా అడవుల్లో తిరిగిన పెద్దపులి ఒక్కసారిగా ఫారెస్ట్ అధికారులకు చిక్కి ఎంక్లోజర్ లోకి వెళ్లడంతో.. ఇక్కడి వాతావరణం అలవాటు పడేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. దీంతో ఏఆర్సి సెంటర్లోకి బోనులో తీసుకొచ్చి ఎన్క్లోజర్ లోకి పంపగానే.. ఒక్కసారిగా పరుగు తీసింది. లోపల గాండ్రిస్తూ అటు ఇటు తిరిగింది. కొంచెం అవకాశం ఉన్నా పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది.
అయితే.. విశాఖ ఏ ఆర్ సి సెంటర్కు తీసుకు వచ్చిన తర్వాత పెద్దపులికి ద్రవాహారం ఇచ్చారు సంరక్షకులు. నీటిలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ కలిపి పులికి పెడుతున్నరు యానిమల్ కీపర్. పట్టుబడిన రెండు మూడు రోజుల వరకు ఆందోళనలో ఉండే పులి.. ఘన ఆహారం తీసుకోబోదంటున్నరు అధికారులు. అయితే.. ఎవరైనా కనిపిస్తే ఎన్‌క్లోజర్ లో గాండ్రిస్తూ అటు ఇటు తిరుగుతోంది. దీంతో సాధ్యమైనంతవరకు పులికి కనిపించకుండా దూరంగానే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు సిబ్బంది. ఆహారం అందించెందుకు మాత్రమే పులి దగ్గరకు వెళ్తున్నరు. సీసీ కెమెరాల ద్వారా పెద్దపులి ప్రవర్తనను పరిశీలిస్తున్నరు అధికారులు.
పెద్దపులి ఆరోగ్యం, ఆహారం తీసుకునే విధానం, ప్రవర్తనపై ఎప్పటికప్పుడు పర్యవేక్షస్తున్నారు. పెద్దపులి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం స్ట్రెస్ లో ఉన్న పెద్దపులి.. ద్రవాహారం మాత్రమే తీసుకుంటుంది. రెండు మూడు రోజుల్లోనే మళ్లీ ఈ పులి.. ఘానాహారం తీసుకుంటుందని అంటున్నారు యానిమల్ కీపర్. ప్రతిరోజు ఉదయం గుడ్లు కలిపిన పాలు, సాయంత్రం బీఫ్ అందిస్తామని అంటున్నారు. సిసిఎఫ్ దివాన్ మోహియుద్దీన్ పర్యవేక్షణలో.. జూ క్యూరేటర్ మంగమ్మ, వెటర్నరీ డాక్టర్ భాను ప్రసాద్ పులిని సంరక్షిస్తున్నారు. పులుల సంరక్షణలో సుదీర్ఘ అనుభవం ఉన్న యానిమల్ కీపర్ మల్లు.. ఈ పెద్దపులికి అధికారుల సూచనలతో డైట్ అందిస్తూ కేర్ తీసుకుంటున్నారు.
వీడియో చూడండి..
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తాడోబా-అంధేరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏపీలోకి చొరబడినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మూడున్నర ఏళ్ల వయసు గల ఈ మగ పులి దాదాపుగా 250 నుంచి 300 కిలోల వరకు బరువు ఉంది. హెల్దీగా కనిపిస్తోంది. ఈ పులిని ఎన్‌క్లోజర్ లో బంధించారు కాబట్టి.. పూర్తిగా స్థానిక పరిస్థితులకు అలవాటు పడి కోలుకునేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గైడ్లైన్స్ ను ఫాలో అవుతూ.. ఈ పులిని జూ కు తరలించాలా లేక మళ్లీ అడవుల్లో విడిచి పెట్టే అవకాశం ఉంటుందా అనే దానిపై నిర్ణయం త్వరలోనే తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
