Sweat Odor: చెమట స్మెల్ తో ఇబ్బంది పడుతున్నారా.. సింపుల్ చిట్కాతో చెక్ పెట్టండి.. 24 తాజాదనం మీ సొంతం..
కొంత మందికి విపరీతమైన చెమట పడుతుంది. అప్పుడు శరీరం నుంచి దుర్వాసన వెలువడుతుంది. అంతేకాదు శరీరం మీద చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఆరోగ్యంపై కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు చెమట వాసన వచ్చేవారి దగ్గరకు ఎవరైనా రావడానికి కూడా ఇబ్బంది పడతారు. అందుకనే చాలా మంది ఖరీదైన పెర్ఫ్యూమ్‌లను ఉపయోగిస్తారు. అయితే ఇలా ఖరీదైన పెర్ఫ్యూమ్‌లను ఉపయోగించే బదులు.. ఇంట్లోనే సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టవచ్చు. తక్కువ ఖర్చుతోనే చెమట దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు.

కొంతమందికి చెమట పట్టినప్పుడు దుర్వాసన వస్తుంది ( చెమట వాసన ). అటువంటి సమస్యతో ఇబ్బంది పడేవారు.. పది మందిలో కొంచెం ఇబ్బంది పడతారు. అందరి ముందు కౌగిలించుకోవడానికి లేదా చేయి పైకెత్తడానికి కూడా సిగ్గుపడతారు. అందుకనే చాలా మంది చెమట నుంచి వచ్చే దుర్వాసన సమస్య నివారణకు వివిధ చర్యలు తీసుకుంటారు. ఖరీదైన పరిమళ ద్రవ్యాలను అప్లై చేస్తారు. రకరకాల పెర్ఫ్యూమ్‌లను ఉపయోగిస్తారు. అయితే వీటికి బదులుగా కేవలం 20 రూపాయలకే చెమట దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. సులభమైన పరిష్కారం తయారు చేయవచ్చు. ఈ పదార్ధంలోని సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అవి దుర్వాసనను తొలగించడమే కాకుండా చెమటను కూడా తగ్గిస్తాయి.
స్పటికతో చెమట స్మెల్ కి చెక్ పెట్టండి
స్పటికలో సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది శరీరంపై చెమట ద్వారా ఉత్పత్తి అయ్యే దుర్వాసన , బ్యాక్టీరియాను చంపుతాయి. దీని ఆస్ట్రిజెంట్ లక్షణాలు చర్మ రంధ్రాలను కుదించి, చెమటను తగ్గించి, మిమ్మల్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతాయి.
స్పటికాన్ని ఎలా ఉపయోగించాలి?
స్నానం చేసేటప్పుడు: స్నానపు నీటిలో ఒక చిన్న స్ఫటిక ముక్క వేసి… దానిని కరిగించి, ఆ నీటితో స్నానం చేయండి. ఇది మొత్తం శరీరం నుంచి దుర్వాసనను తొలగిస్తుంది.
డైరెక్ట్ గా అప్లై చేయండి: క్రిస్టల్‌ను కొద్దిగా తడిపి చంకల్లో లేదా పాదాలపై రుద్దండి. ఇది బ్యాక్టీరియాను చంపుతుంది. బాహు మూలాలలోని దుర్వాసనను తొలగిస్తుంది.
స్పటికం పౌడర్: స్ఫటికాన్ని పౌడర్‌గా చేసి.. అధిక చెమట పట్టే ప్రాంతాల్లో ఈ పౌడర్ ని అప్లై చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








