- Telugu News Photo Gallery Spiritual photos Guru Gochar 19 September 2025: these zodiac signs luck will change the fortunes
Guru Gochar 2025: రేపు బృహస్పతి నక్షత్ర మార్పు.. ఈ నాలుగు రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం..
నవ గ్రహాల్లో దేవ గురువు బృహస్పతి ఒక గ్రహం. ఎవరి జాతకంలో బృహస్పతి (గురువు) శుభస్థానంలో ఉంటాడో వారికి సంపద, సంతానం, శ్రేయస్సు కలుగుతాయి. వివాహ కారకుడు. అటువంటి బృహస్పతి నక్షత్ర స్థాన సంచారము రేపు (శుక్రవారం సెప్టెంబర్19, 2025) జరగనుంది. ఈ బృహస్పతి సంచారము అనేక రాశులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చాలామంది అదృష్టం ప్రకాశిస్తుంది. ఆర్థిక లాభాలను అందుకుంటారు.
Updated on: Sep 18, 2025 | 1:47 PM

2025 లో దేవ గురువు బృహస్పతి తన నక్షత్ర స్థాన సంచారములో ఒక ప్రధాన దశలో ఉన్నాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో బృహస్పతి పునర్వసు నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశిస్తాడు. ఇది సెప్టెంబర్ 19, 2025 శుక్రవారం మధ్యాహ్నం 2:01 గంటలకు జరుగుతుంది. 2025 సంవత్సరం గురువు నక్షత్ర స్థాన సంచారాం ముఖ్యమైన దశలను చూస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో బృహస్పతి పునర్వసు నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశిస్తాడు.

బృహస్పతి పునర్వసు నక్షత్రం మొదటి పాదంలో ఆగస్టు 13, 2025న సంచారం చేశాడు. రెండవ పాదంలో ఆగస్టు 30, 2025న అడుగు పెట్టి సెప్టెంబర్ 19 మధ్యాహ్నం వరకూ ఉండనున్నాడు. రేపు బృహస్పతి పునర్వసు నక్షత్రం మూడవ పాదంలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ బృహస్పతి సంచారముతో మేషం, కర్కాటకం, కన్య , కుంభం వంటి నాలుగు రాశుల వారి అదృష్టం మారుతుంది. ఈ రాశుల వారు ఏయే రంగాలలో ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాం.

మేషరాశి: మేష రాశి వారు స్వర్ణయుగాన్ని అనుభవించబోతున్నారు. బృహస్పతి సంచారం నక్షత్ర పాదం మార్పు వీరికి ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. కుటుంబంలో ఆనందం కలుగుతుంది. తల్లిదండ్రులను గౌరవించండి. సంపద వృద్ధి చెందే బలమైన అవకాశం ఉంది.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు సాధ్యమయ్యే అవకాశం ఉంది. కష్టపడి పనిచేయడం వల్ల ఫలితం లభిస్తుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కెరీర్‌లో కూడా విజయం సాధించవచ్చు

కన్య రాశి: ఈ రాశి వారికి బృహస్పతి సంచారము విజయాన్ని తెస్తుంది. వ్యాపారం , వృత్తి రెండింటిలోనూ పురోగతి కనిపిస్తుంది. వీరి ఎదురయ్యే సమస్యలను తామే స్వయంగా పరిష్కరించుకోగలుగుతారు. తమ జీవిత భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.

కుంభ రాశి: కుంభ రాశి వారికి గురు గ్రహం నక్షత్ర సంచారం వల్ల గణనీయమైన ప్రయోజనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది . కెరీర్‌కు సంబంధించిన సానుకూల వార్తలు వినే అవకాశం ఉంది. చేపట్టిన ప్రయత్నాలు విజయాన్ని తెస్తాయి. కష్టపడి పనిచేయడం వలన తగిన ఫలితాలను అందుకుంటారు. ఇతరులను అవమానించకుండా ఉండండి. మాట మధురంగా ఉండేలా చూసుకోండి.




