AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వీటిని వాడడం స్టార్ట్‌ చేస్తే.. ఇక టూత్‌బ్రష్‌లకు గుడ్‌బై చెప్పాల్సిందే.. ప్రయోజనాలు అలాంటివి మరీ!

దంతాల ఆరోగ్యానికి టూత్‌పేస్ట్‌లు, బ్రెష్‌ వాడడం కంటే ప్రకృతిలో సహజంగా లభించే మూలికలు, వేప, వంటి చెట్ల కొమ్మలను ఉపయోగించడం ఉత్తమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించడం వలన ఆరోగ్యంతో పాటు తెల్లటి దంతాలు కూడా సొంత చేసుకోంచ్చంటున్నారు. ఇంతకు వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Health Tips: వీటిని వాడడం స్టార్ట్‌ చేస్తే.. ఇక టూత్‌బ్రష్‌లకు గుడ్‌బై చెప్పాల్సిందే.. ప్రయోజనాలు అలాంటివి మరీ!
White Teeth
Anand T
|

Updated on: Sep 18, 2025 | 3:26 PM

Share

దంతాల ఆరోగ్యం కోసం మనం ఇప్పుడు ఎక్కువగా టూత్‌పేస్ట్‌లు బ్రెష్‌లు వాడుతున్నాం. కానీ దంతాలు పసుపు రంగులోకి మారడానికి, చిగుళ్ళు బలహీనపడటానికి ఇదే కారణమని చాలా మందికి తెలియదు. ఇవేవీ అందుబాటులో లేనప్పుడే మన పెద్దవాళ్లు ప్రకృతిలో సహజంగా దొరికే మూలకాలు, చెట్ల కొమ్మలతో పళ్లు శుభ్రం చేసుకునేవారు. కొన్ని గ్రామాల్లో, ఈ వేప, అకాసియా కర్రలను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనం కూడా మన పెద్దలు ఉపయోగించిన ఈ పద్ధతిని పాటిస్తే, మన దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతన్నారు.

మనకు ప్రకృతిలో దొరికే మూలికల కర్రలతో దంతాలను శుభ్రంచేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నారు. వేప, అకాసియా లేదా కరంజా వంటి చెట్ల కర్రలతో తయారు చేయబడిన సహజ టూత్ బ్రష్‌లతో పళ్లు తోముకోవడం ద్వారా దంతాలు ప్రకాశవంతగా మెరవడంతోపలు దృడంగా మారుతాయి. అలాగే చిగుళ్ళకు మంచి మసాజ్ లభిస్తుంది. అంతేకాకుండా నోటిలో ఉన్న బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది.

వీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

సహజ క్రిమినాశక: వేప, అకాసియా కర్రలు చేదుగా ఉంటాయి. కాబట్టి ఇవి యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని నమలడం వల్ల ఫైబర్స్ దంతాల మధ్య చొచ్చుకుపోయి చిక్కుకున్న ఆహారం, ఫలకాన్ని తొలగిస్తాయి.అలాగే చిగుళ్ళను సున్నితంగా మసాజ్ చేస్తుంది, ఇది రక్త ప్రసరణను పెంచుతుంది, చిగుళ్ళను కూడా బలపరుస్తుంది.

పసుపు రంగు పోతుంది: ఈ ప్రకృతి మూలకాలను క్రమం తప్పకుండా వాడటం వల్ల దంతాల పళ్లపై ఉన్న పసుపు వర్ణం, పాచి తొలగిపోయి, తెల్లటి మెరిసే దంతాలను మీరు పొందుతారు. అలాగే ఈ కర్రలు నోటి దుర్వాసనను తొలగిస్తాయి.

దీన్ని ఎలా వాడాలి? ఉదయం, వేప లేదా అకాసియా యొక్క పలుచని కర్రను తీసుకోండి. దాని ఒక చివరను నమిలి, బ్రేష్‌లా చేసుకొండి. ఆ తరువాత దానిని మీ దంతాలపై సున్నితంగా రుద్దండి. మీ చిగుళ్ళను మసాజ్ చేయండి. రోజు నిద్రలేచిన వెంటనే వీటితో పళ్లు తోముకోవడం వల్ల మీరు దంతాలు శుభ్రంగా మారడంతో పాటు మీరు నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.