Bad Sleeping Posture: ఇలా పడుకుంటే అంతే సంగతులు.. ఏకంగా మూడు అవయవాలు పూర్తిగా దెబ్బతింటాయి..
సుఖ ఎంత నిద్ర అవసరమో.. నిద్రపోయే పోశ్చర్( sleeping posture) కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రోజూ పడుకునే విధానం సక్రమంగా లేకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
మనిషికి నిద్ర చాలా అవసరం.. శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా.. మెదడు చురుగ్గా పనిచేయాలన్నా సరిపడిన నిద్ర తప్పనిసరి. రోజంతా బిజీ షెడ్యూల్ తర్వాత, అలసటను తొలగించడానికి రాత్రి కనీసం 6-7 గంటల నిద్ర అవసరం. ఇది కళ్ళు, మెదడుతో సహా శరీరంలోని కండరాలు, అవయవాలు తిరిగి శక్తిని పెంపొందించుకునేందుకు సాయపడుతుంది. సుఖ ఎంత నిద్ర అవసరమో.. నిద్రపోయే పోశ్చర్( sleeping posture) కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రోజూ పడుకునే విధానం సక్రమంగా లేకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి హాని చేసే కొన్ని చెడు నిద్ర భంగిమల గురించి ఇప్పుడు చూద్దాం. అలాగే వాటి వల్ల శరీరంలో ఏ భాగం ప్రభావితం అవుతుందో తెలుసుకుందాం..
పొట్టపై పడుకోవడం..
కొందరికీ బొక్కబోర్లా పడుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే దీని వల్ల చాలా సమస్యలు వస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు.
వెన్నుపాముకు దెబ్బ.. పొట్ట భారం పెట్టి పడుకోవడం వల్ల వెన్నుపాము దెబ్బతింటుంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్న మహిళల్లో. పొట్టపై పడుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది, ఫలితంగా డిస్క్ సమస్యలకు దారితీస్తుంది.
ఊపిరితిత్తులపై ప్రభావం.. బోర్లా పడుకోవడం వల్ల స్త్రీల ఛాతీ తగ్గిపోతుంది. దాని ప్రభావం వారి ఊపిరితిత్తులపై పడుతుంది . ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. శ్వాస సమస్యలు ఉన్న స్త్రీలు అస్సలు బోర్లా పడుకోకూడదు.
భుజం, మెడ.. బోర్లా పడుకోవడం వల్ల భుజం, మెడ మధ్య కండరాలు అసాధారణంగా సాగుతాయి. ఈ విధంగా నిద్రపోవడం వల్ల భుజం కీళ్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా భుజాలలో నొప్పి మొదలవుతుంది.
మరి ఎలా పడుకోవాలి..
శరీర బరువును వీపుపై వేసి వెల్లకిలా పడుకోవాలి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు. వైద్యులు కూడా అలాంటి వారికి వీపుపై పడుకోవాలని సలహా ఇస్తారు. అప్పుడప్పుడూ ఒకవైపు పక్కకు తిరిగి కూడా పడుకోవచ్చు. ఒకవేళ మీకు నిద్ర పోజిషన్ గురించి ఇంకా క్లారిటీ కావాలంటే మీ వైద్యుడిని సంప్రదించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..