Back Pain Relief: నడుము నొప్పితో బాధపడుతున్నారా? జస్ట్ ఈ మార్పులు చేస్తే అంతా సెట్ అవుతుంది..!
సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. మీ జీవనశైలి సరిగా ఉండాలి. అలాగే మీరు పడుకునే విధానంతో పాటు.. బెడ్, మంచం కూడా సరిగా ఉండాలి. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా తినే ఆహారంతో పాటు.. నిద్రించే పరుపులు, బెడ్‌లు కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. మీ జీవనశైలి సరిగా ఉండాలి. అలాగే మీరు పడుకునే విధానంతో పాటు.. బెడ్, మంచం కూడా సరిగా ఉండాలి. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా తినే ఆహారంతో పాటు.. నిద్రించే పరుపులు, బెడ్‌లు కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి చాలా మంది పడుకునేటప్పుడు మీ తలని ఏ వైపు ఉంచాలి? ఏ వైపున పడుకోవాలి? అనేది కీలకంగా భావిస్తారు. ఎందుకంటే ఇది శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. నిద్రపోయే విధానం సరిగా లేకపోతే.. కడుపులో గ్యాస్, గుండెల్లో మంట, పుల్లని త్రేన్పులు వంటి సమస్యలు వస్తాయి ఇలాంటి సమస్యలు వస్తే.. పడుకునే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ మార్పులు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
గుండెల్లో మంట..
గుండెల్లో మంట, గ్యాస్ సమస్య వచ్చినట్లయితే మంచంపై తలగడ పెట్టుకుని, తల కాస్త ఎత్తుగా ఉండేలా నిద్రించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గ్యాస్ క్రిందికి కదులుతుందట. ఆమ్లత్వ ప్రభావం ఉండదు. దీంతో గుండెల్లో మంట సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
పొత్తి కడుపులో నొప్పి..
కడుపులో నొప్పి ఉంటే.. వెల్లకిగా పడుకోవాలి. తల కాస్త పైకి ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కడుపు ఉబ్బరం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుందంటున్నారు.




వెరికోస్ వెయిన్స్ సమస్య..
చాలా మంది వెరికోస్ వెయిన్స్ సమస్యతో సతమతం అవుతుంటారు. ఈ వ్యాధి కారణంగా రక్త నాళాలపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వెరికోస్ వెయిన్స్ ఉన్న ప్రదేశంలో మెత్త వేసుకుని నిద్రించాలి. తద్వారా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. వాపు కూడా తగ్గుతుంది.
అధిక బీపీ..
హైబీపీ కారణంగా శరీరం బలహీనంగా మారుతుంది. ఇది ఆరోగ్యానికి హానీ తలపెడుతుంది. ఇలాంటి పరిస్థితిలో కాళ్ల మధ్యలో ఒక దిండు పెట్టుకుని నిద్రించాలి. తద్వారా రక్త ప్రసరణ సాఫీగా జరిగి, బీపీ తక్కువగా ఉంటుంది.
సయాటికా నొప్పి..
సయాటికా నొప్పి కారణంగా రక్త ప్రసరణ తగ్గుతుంది. వెన్నెముక ఎముకలలో నొప్పి మొదలవుతుంది. దీని నుంచి బయటపడాలంటే కాళ్ల మధ్య దిండు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగడంతో పాటు.. నొప్పి కూడా తగ్గుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..