Baba Ramdev: బాబా రామ్‌దేవ్ చెప్పిన 5 నిమిషాల పవర్ యోగా.. తక్కువ టైమ్‌లోనే ఎక్కువ బెనిఫిట్స్..
బాబా రామ్‌దేవ్ చాలా కాలంగా యోగాను ప్రతి ఇంటికి చేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. యోగా శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కొంతమంది సమయం లేకపోవడం వల్ల దీనిని చేయడం లేదు. అయితే బాబా రామ్‌దేవ్ 5 నిమిషాల పవర్ యోగా గురించి కూడా చెప్పారు. ఇది మీ శరీరానికి తక్కువ సమయంలోనే అనేక ప్రయోజనాలను ఇస్తుంది.

యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రపంచవ్యాప్తంగా యోగాకు కొత్త గుర్తింపు తెచ్చారు. పతంజలి ద్వారా ఆయుర్వేద పురాతన పద్ధతులను ప్రతి ఇంటికి చేర్చడంలో ఆయన ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. నిత్యం యోగా చేయడం వల్ల అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చని మనందరికీ తెలుసు. అయితే బిజీగా ఉండే షెడ్యూల్ కారణంగా చాలా మందికి యోగాకు సమయం కేటాయించడం సాధ్యం కాదు. అటువంటి వారి కోసం బాబా రామ్‌దేవ్ ఒక పరిష్కారాన్ని సూచించారు. అదే కేవలం ఐదు నిమిషాల పవర్ యోగా. ఈ పవర్ యోగా అంటే ఏమిటీ..? దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాబా రామ్‌దేవ్ 5 నిమిషాల పవర్ యోగా
బాబా రామ్‌దేవ్ ఒక వీడియోలో ఈ 5 నిమిషాల పవర్ యోగా గురించి వివరించారు. ఈ పవర్ యోగాలో కొన్ని ఆసనాలను 5 నిమిషాల పాటు చేయడం ద్వారా శరీరానికి శక్తి లభిస్తుందని, ఇది మొత్తం ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుందని ఆయన చెప్పారు. ఈ పవర్ యోగాలో గద ఘుమ్న, హనుమాన్ దండ, సూర్య నమస్కారం, చక్రాసన, వజ్రాసన వంటివి ఉన్నాయి.
చక్రాసన
చక్రాసన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వెన్నెముకను బలపరుస్తుంది. శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు కూడా ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతారు. ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు చక్రాసన చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
వజ్రాసన – వెన్నునొప్పికి ఉపశమనం
వజ్రాసన చేయడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెన్నునొప్పిని తగ్గించడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలైన ఆమ్లత్వం, మలబద్ధకం వంటి వాటి నుండి ఉపశమనం పొందడానికి వజ్రాసన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 5 నిమిషాలు వజ్రాసన చేయడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది. దృష్టి స్థాయి పెరుగుతుంది.
సూర్య నమస్కారం
5 నిమిషాల పవర్ యోగాలో సూర్యనమస్కారం కూడా ఒక భాగం. ఉదయం 5 నిమిషాలు సూర్య నమస్కారం చేయడం వల్ల రోజంతా శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. కండరాలు బలంగా మారి శరీరంలో వశ్యత పెరుగుతుంది. సూర్య నమస్కారం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
గదను ఊపడం
హనుమాన్ గదతో వ్యాయమం చేయడం మొత్తం ఆరోగ్యానికి మంచిది. కేవలం 5 నిమిషాలు గదతో వ్యాయమం చేస్తే కండరాలు బలంగా మారి శక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఛాతీ మంచి ఆకృతిలోకి చేస్తుంది. కాళ్లు, తొడలను బలపరుస్తుంది. వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.ఈ 5 నిమిషాల పవర్ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చు.
View this post on Instagram
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




