AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అలవాట్లు మీకూ ఉన్నాయా? అయితే త్వరలో మీ ఒంట్లోకి ప్రాణాంతక క్యాన్సర్‌ ఎంట్రీ..

క్యాన్సర్ సోకడానికి ప్రధాన కారణం మన జీవనశైలి అలవాట్లు. ఉదాహరణకు, ఎక్కువసేపు కూర్చోవడం నుండి పొగలుకక్కే వేడి టీ తాగడం వరకు ఇవన్నీ శరీరంలో మార్పులకు కారణమవుతాయి. ఇవి కణాలను మరింత సున్నితంగా చేస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి..

Srilakshmi C
|

Updated on: Sep 04, 2025 | 9:47 PM

Share
క్యాన్సర్ కేవలం జన్యుపరమైన వ్యాధి మాత్రమే కాదు. క్యాన్సర్ వెనుక ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. క్యాన్సర్ సోకడానికి ప్రధాన కారణం మన జీవనశైలి అలవాట్లు. ఉదాహరణకు, ఎక్కువసేపు కూర్చోవడం నుండి పొగలుకక్కే వేడి టీ తాగడం వరకు ఇవన్నీ శరీరంలో మార్పులకు కారణమవుతాయి. ఇవి కణాలను మరింత సున్నితంగా చేస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

1 / 5
రాత్రిపూట ఎక్కువ స్క్రీన్ ఫోన్‌ చూడటం వల్ల స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతి నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. మెలటోనిన్ అనేది DNA ని మరమ్మతు చేసే, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే హార్మోన్. తక్కువ నిద్ర రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు 6 గంటలకు పైగా కూర్చోవడం వల్ల మరణ ప్రమాదం దాదాపు 20 శాతం పెరుగుతుందట. ఎక్కువసేపు కూర్చుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని 6-10 శాతం పెంచుతుందని అధ్యయనాల్లో తేలింది.

2 / 5
ప్రాసెస్ చేసిన మాంసంలో వంట చేసేటప్పుడు లేదా నిల్వ చేసేటప్పుడు వాటిల్లో నైట్రేట్లు, PAH లు ఉంటాయి. ఇవి కొలొరెక్టల్, కడుపు క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంటాయి. WHO ఇప్పటికే ప్రాసెస్ చేసిన మాంసాన్ని క్యాన్సర్ కారకమని గుర్తించింది. అందువల్ల మార్కెట్ నుంచి తాజా మాంసం మాత్రమే కొనుగోలు చేయాలి.

3 / 5
అతిగా వేడిచేసిన పానీయాలు తాగడం అంటే టీ, కాఫీ లేదా 65° సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఏదైనా ఇతర పానీయాలను తాగడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధన ప్రకారం క్రమం తప్పకుండా వేడి పానీయాలు తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం 6 రెట్లు పెరుగుతుంది. అలాగే ప్లాస్టిక్‌లో చుట్టబడిన మైక్రోవేవ్ ఆహారం BPA , థాలేట్‌ల వంటి రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

4 / 5
దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. వాపును పెంచుతుంది. ఇది క్యాన్సర్ కణాలు పెరగడానికి వీలు కల్పిస్తుంది. కాలక్రమేణా ఈ ఒత్తిడి శరీరాన్ని వివిధ రకాల క్యాన్సర్లకు గురి చేస్తుంది. సన్‌స్క్రీన్ ఉపయోగించకపోవడం వల్ల సూర్యుడి అతినీలలోహిత కిరణాల వల్ల DNA దెబ్బతింటుంది.ఇది బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. సన్‌స్క్రీన్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మెలనోమా ప్రమాదాన్ని దాదాపు 50% తగ్గించుకోవచ్చు.

5 / 5