AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? లైట్ తీసుకోకండి.. వెంటనే అలర్ట్ కాకపోతే..

నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి, వాటిలో ముఖ్యమైనది డిప్రెషన్. డిప్రెషన్ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా జీవిత నాణ్యతను కూడా తగ్గిస్తుంది. డిప్రెషన్‌కు కారణాలు ఏమిటీ..? దాని ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? లైట్ తీసుకోకండి.. వెంటనే అలర్ట్ కాకపోతే..
How to Recognize and Combat Depression
Krishna S
|

Updated on: Sep 04, 2025 | 8:55 PM

Share

డిప్రెషన్ అనేది ఒక తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. ఇందులో ఒక వ్యక్తి నిరంతరం నిరాశ, విచారం ప్రతికూల ఆలోచనలతో బాధపడతాడు. ఈ పరిస్థితి వ్యక్తి యొక్క ఆలోచనా విధానం, పని చేసే సామర్థ్యం, జీవితాన్ని ఆస్వాదించే ఆసక్తిని ప్రభావితం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, మెదడులోని రసాయన మార్పులు, ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్యాలు, లేదా ఏదైనా పెద్ద నష్టం డిప్రెషన్‌కు ప్రధాన కారణాలు. ఆధునిక జీవనశైలి, పని ఒత్తిడి, సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటుపడటం కూడా దీనికి దారితీయవచ్చు. జన్యుపరమైన కారణాలు అంటే కుటుంబంలో ఎవరికైనా డిప్రెషన్ ఉంటే, ఆ ప్రమాదం మరింత పెరుగుతుంది.

డిప్రెషన్ రకాలు – ప్రమాద కారకాలు

డిప్రెషన్‌లో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యమైన వాటిలో మేజర్ డిప్రెసివ్ డిజార్డర్, ఇందులో వ్యక్తి దీర్ఘకాలం పాటు తీవ్రమైన నిరాశను అనుభవిస్తాడు. నిరంతర డిప్రెసివ్ డిజార్డర్లో లక్షణాలు తేలికపాటివిగా ఉన్నా, చాలా కాలం పాటు ఉంటాయి. ప్రసవం తర్వాత మహిళల్లో వచ్చే ప్రసవానంతర డిప్రెషన్, వాతావరణం మారినప్పుడు వచ్చే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ కూడా ఉన్నాయి.

మహిళలు, టీనేజర్లు, వృద్ధులకు డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అలాగే మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత లేదా కుటుంబ చరిత్ర ఉన్నవారు కూడా ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు. మద్యపానం లేదా మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రారంభ లక్షణాలు – తీవ్రత

డిప్రెషన్ సాధారణంగా చిన్న లక్షణాలతో మొదలవుతుంది. వ్యక్తి నిరంతరం విచారంగా లేదా ఏకాంతంగా ఉండటం, నిద్ర సమస్యలు, చిరాకు, అలసట, ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం దీని ప్రారంభ సంకేతాలు. తినే అలవాట్లలో కూడా మార్పు వస్తుంది. కొందరు ఎక్కువగా తినడం మొదలుపెడితే, మరికొందరు ఆకలి లేదని అంటుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గడం, ప్రతికూల ఆలోచనలు, తమను తాము పనికిరానివారిగా భావించడం కూడా దీని లక్షణాలే.

ఈ లక్షణాలు చాలా కాలం పాటు కొనసాగి, వ్యక్తి యొక్క పని, సంబంధాలు, రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. తీవ్రమైన డిప్రెషన్‌లో, ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో వైద్య సలహా, కుటుంబ మద్దతు, కౌన్సెలింగ్‌తో దీనిని నియంత్రించవచ్చు.

డిప్రెషన్ నివారణకు మార్గాలు..

పోషకాహారం: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.

వ్యాయామం: రోజూ వ్యాయామం, యోగా చేయడం.

సరైన నిద్ర: తగినంత నిద్ర పొందడం, క్రమబద్ధమైన సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం.

ఒత్తిడి నివారణ: ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా ఇతర విశ్రాంతి పద్ధతులు పాటించడం.

వ్యసనాలకు దూరం: మద్యపానం, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం.

నలుగురితో కలిసి : మీ ఆలోచనలు, భావాలను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోవడం.

వైద్య సలహా: అవసరమైతే వైద్యుడిని లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం.

ఈ చిట్కాలు పాటించడం ద్వారా డిప్రెషన్‌ను నివారించడమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..