Hair Care Tips: జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా..? బాదం నూనెను ఇలా వాడితే కేశసౌందర్యం మీ సొంతం..!

ఇది జుట్టును మెరుస్తూ, బలంగా, దట్టంగా ఉండేలా చేస్తుంది. ఈ సహజ నూనె సాధారణ జుట్టు సమస్యలతో పాటు ఇతర తీవ్రమైన సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పొడి జుట్టు సమస్య, బట్టతల, జుట్టు పల్చబడటం, జుట్టు అకాల నెరవడం వంటి అనేక సమస్యలను నియంత్రించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

Hair Care Tips: జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా..? బాదం నూనెను ఇలా వాడితే కేశసౌందర్యం మీ సొంతం..!
బాదంలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా బాదంలో కాల్షియం, ఫాస్పరస్ కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి పోషకాలను అందిస్తాయి. బాదం పప్పును ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 02, 2024 | 7:08 PM

మారుతున్న వాతావరణం కారణంగా చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది జుట్టు రాలే సమస్యతో సతమతమవుతున్నారు. అలాంటప్పుడు మీ జుట్టును ఎలా చూసుకోవాలో తెలియక చిక్కుల్లో పడుతున్నారు. మార్కెట్లో లభించే ఖరీదైన షాంపులు, హెయిర్‌ ఆయిల్స్‌ వాడుతూ మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కానీ, ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్ జుట్టు సంరక్షణ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. జుట్టు ఆరోగ్యం కోసం బాదం నూనెలో ఈ మూడు ఆయిల్స్‌ కలిపి వాడితే జుట్టు పెరుగుదలకు ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జుట్టు సంరక్షణ కోసం బాదం నూనెతో కొన్ని పదార్థాలను కలపడం ద్వారా ఇంట్లో తయారుచేసిన ఈ సహజ నూనె ఆరోగ్యకరమైన జుట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. బాదం నూనె, ఆవాల నూనె, కరివేపాకు, మెంతి గింజలతో ఇంట్లో తయారుచేసిన సహజ నూనె జుట్టు రాలే సమస్యకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

ఒక అధ్యయనం ప్రకారం, రోజ్మేరీ ఆయిల్ జుట్టుకు ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ నూనెను రోజూ వాడితే మూడు నుంచి ఆరు నెలల్లో ఫలితం కనిపిస్తుంది. మెంతి గింజలు జుట్టు మూలాలకు పోషణను అందిస్తాయి. తలలో రక్త ప్రసరణను పెంచుతాయి. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టుకు మెంతి గింజలు మేలు చేస్తాయి. ఇందులో ఉండే ప్రొటీన్, నికోటినిక్ యాసిడ్ (విటమిన్ బి) జుట్టు లోపలి నుండి పోషణలో సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడం, చుండ్రు సమస్యను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మెంతి గింజలలోని లభించే ప్రోటీన్ జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే, కరివేపాకులోని ప్రోటీన్, బీటా కెరోటిన్ మీ జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడేందుకు మస్టర్డ్ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఆవాల నూనెతో పొడిబారిన, నిర్జీవమైన జుట్టుకు పోషణను అందిస్తుంది. ఇది ఆల్ఫా కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది జుట్టుకు తేమను అందిస్తుంది. ఇది జుట్టుకు సహజమైన కండిషనింగ్ ప్రభావాన్ని కూడా ఇస్తుంది.

ఆవనూనెతో జుట్టు, తలపై మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల వెంట్రుకలు వేర్లు నుండి బలంగా తయారవుతాయి. వెంట్రుకల చివర్లు చిట్లిపోకుండా ఉంటాయి. ఆవాల నూనెలో లినోలెనిక్ మరియు ఒలీక్ యాసిడ్ నిష్పత్తి జుట్టును హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

బాదం నూనె మీ జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తేలికైన, వేగంగా శోషించే నూనెను ఉపయోగించడం వల్ల త్వరగా జుట్టు పొడవు పెరుగుతుంది. జుట్టు మందంగా, నల్లగా మారుతుంది. బాదం నూనెలో విటమిన్ A, విటమిన్ B7, విటమిన్ E, SPF 5, బయోటిన్, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు ఉంటాయి. ఇది జుట్టును మెరుస్తూ, బలంగా, దట్టంగా ఉండేలా చేస్తుంది. ఈ సహజ నూనె సాధారణ జుట్టు సమస్యలతో పాటు ఇతర తీవ్రమైన సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పొడి జుట్టు సమస్య, బట్టతల, జుట్టు పల్చబడటం, జుట్టు అకాల నెరవడం వంటి అనేక సమస్యలను నియంత్రించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

అయితే, జుట్టుకు ఎదైనా కొత్తగా నూనె, మాస్క్ వేసుకునే ముందు, మీరు సంబంధిత నిపుణుడిని సంప్రదించాలి. ఎందుకంటే- ప్రతి ఒక్కరి జుట్టు లక్షణాలు, సమస్యలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, ఏదైనా హెయిర్ ట్రీట్‌మెంట్ తీసుకునే ముందు నిపుణులైన డాక్టర్‌ని సంప్రదించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..