AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahindra Thar Viral Video: రూ. 700లకు థార్‌ అడిగిన చిన్నారి.. నేరుగా ఫ్యాక్టరీకే.. ఆనంద్‌ మహీంద్రా రియాక్షన్‌..!

ఆనంద్ మహీంద్రా ఇటీవల తన X ఖాతా నుండి మహీంద్రా కంపెనీ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్న చికు వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రారంభంలో థార్ కారును 700 రూపాయలకు ఇవ్వాలని కోరిన చిన్నారి సంతోషం కనిపించింది...ఆ తరువాత చికులా మహీంద్రా కంపెనీ ప్లాంట్‌లోకి చేరుకున్న తర్వాత థార్ కారు ఎలా తయారు చేస్తున్నారో చూపించారు. ఈ సందర్భంగా చికుకు మహీంద్రా కారు ..

Mahindra Thar Viral Video:  రూ. 700లకు థార్‌ అడిగిన చిన్నారి.. నేరుగా ఫ్యాక్టరీకే.. ఆనంద్‌ మహీంద్రా రియాక్షన్‌..!
Anand Mahindra Hosts Cheeku
Jyothi Gadda
|

Updated on: Feb 02, 2024 | 5:31 PM

Share

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల చికు అనే చిన్నారి వీడియోను షేర్‌ చేశారు. ఇందులో 700 రూపాయలకు థార్ కారు దొరుకుతుందా అని ఆ చిన్నారి అడగటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. దీనికి ఆనంద్ మహీంద్రా చాలా ఆసక్తికరమైన సమాధానం కూడా ఇచ్చారు. రూ.700కి థార్ కార్లను అమ్మడం ప్రారంభిస్తే త్వరలోనే దివాళా తీస్తాం అంటూ సమాధానం ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఆ తరువాత ఆ చిన్నారి వీడియో, దానికి ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అయితే, ఆ వీడియోలోని చిన్నారి మాటలకు ఆనంద్‌ మహీంద్ర ఫిదా అయ్యాడు. ఆ చిన్నారి అడిగిన ముద్దు ముద్దు మాటలు వీడియో చూసి ఆనంద్ మహీంద్రా కూడా అతని మాయలో పడిపోయాడు.. తనకు జీవితంలో మరచిపోలేని గిఫ్ట్‌ ఇచ్చాడు. థార్ తయారు చేస్తున్న మహీంద్రా భారీ ప్లాంట్‌ను సందర్శించడానికి ఆహ్వానించాడు.

ఆనంద్ మహీంద్రా ఇటీవల తన X ఖాతా నుండి మహీంద్రా కంపెనీ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్న చికు వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రారంభంలో థార్ కారును 700 రూపాయలకు ఇవ్వాలని కోరుతున్న చిన్నారి కనిపించాడు..ఆ తరువాత చికులా మహీంద్రా కంపెనీ ప్లాంట్‌లోకి చేరుకున్న తర్వాత థార్ కారు ఎలా తయారు చేస్తున్నారో చూపించారు. ఉంది. ఈ సందర్భంగా చికుకు మహీంద్రా కారు చిన్న మోడల్‌ను బహుమతిగా అందించారు. ఈసారి వీడియోలో చికు చాలా సరదాగా, సంతోషంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

చికు వీడియోను షేర్‌ చేస్తూ.. ఆనంద్ మహీంద్రా ఇలా వ్రాశాడు – చికు చకాన్‌లోని మహీంద్రా ప్లాంట్‌కి వెళ్లాడు. వైరల్ వీడియో నుండి నిజ జీవిత సంఘటన వరకు… థార్ అభిమాని చికు మా చకన్ ఫ్యాక్టరీని సందర్శించాడు. అతనిలో ఒక మధురమైన చిరునవ్వు, స్ఫూర్తిని చూశాం. మా ఉత్తమ బ్రాండ్ అంబాసిడర్‌లుగా మీరు హోస్ట్ చేసినందుకు @ashakarga1, టీమ్ @Mahindraautoకి ధన్యవాదాలు అని తెలిపారు.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో జనాలు పెద్ద ఎత్తున కామెంట్లు చేయడం ప్రారంభించారు. చికు హృదయంలో ఇది ఎప్పటికీ నిలిచిపోయే ఒక మధుర జ్ఞాపకం అని ఒక వినియోగదారు రాశారు. చికు మహీంద్రా ఉత్తమ, అత్యంత ప్రియమైన బ్రాండ్ అంబాసిడర్ అని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..