Unique village: ఆడవారి ఆనవాళ్లు కూడా లేని వింత గ్రామం.. ఊరంతా బ్రహ్మచారులే..! కారణం ఇదేనట..

ఈ గ్రామం మొత్తం చూస్తే పురుషులు మాత్రమే నివసిస్తారు.. స్త్రీలు చూసేందుకు కూడా కనిపించరు. గత 50 ఏళ్లలో ఈ గ్రామంలో ఏ ఒక్క మహిళ కూడా ఏ పురుషుడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. దీనివల్ల ఈ ఊరి పురుషులు అవివాహితులుగానే మిగిలిపోయారు... మరి ఈ ఊరి మగవాళ్లను పెళ్లి చేసుకోవడానికి ఏ ఒక్క మహిళ ముందుకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం..

Unique village: ఆడవారి ఆనవాళ్లు కూడా లేని వింత గ్రామం.. ఊరంతా బ్రహ్మచారులే..! కారణం ఇదేనట..
Barwaan Kala Bihar
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 02, 2024 | 6:07 PM

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన క్షణం. కల్యాణం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పండుగ లాంటిది. బీహార్‌లోని ఓ గ్రామంలో బ్రహ్మచారిగా ఉంటున్న యువకులు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ వారికి పెళ్లి జరగడం లేదు. అందుకే ఈ గ్రామాన్ని ‘కన్యల గ్రామం’ అంటారు. ఇది వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు.. కానీ ఇది నిజం. బర్వాన్ కాలా గ్రామం బీహార్ రాజధాని పాట్నా నుండి 300 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ గ్రామం మొత్తం చూస్తే పురుషులు మాత్రమే నివసిస్తారు.. స్త్రీలు చూసేందుకు కూడా కనిపించరు. గత 50 ఏళ్లలో ఈ గ్రామంలో ఏ ఒక్క మహిళ కూడా ఏ పురుషుడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. దీనివల్ల ఈ ఊరి పురుషులు అవివాహితులుగానే మిగిలిపోయారు… మరి ఈ ఊరి మగవాళ్లను పెళ్లి చేసుకోవడానికి ఏ ఒక్క మహిళ ముందుకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం..

బీహార్‌లోని కైమూర్ కొండల్లో ఎత్తైన ఈ బర్వాన్ కాలా గ్రామం ఉంది.. కొండపైకి వెళ్లే మార్గంలో రాళ్లు, అరణ్యాల మీదుగా ప్రయాణించాలి. ఆ గ్రామానికి చేరుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఏ మహిళ కూడా ఆ ప్రాంతానికి వెళ్లడానికి ఇష్టపడదు.. అందుకే ఆడవాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఈ గ్రామానికి చెందిన ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోరు.. అయితే 2017లో ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లి చేసుకుని భార్యతో కలిసి గ్రామానికి వచ్చి రికార్డు సృష్టించాడు..

అయితే, అతడి పెళ్లి కోసం గ్రామ ప్రజలంతా చాలా కష్టపడ్డారట. గ్రామస్తులంతా కలిసి కొండలు, అడవిని నరికి 6 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న వ్యక్తి అజయ్‌కుమార్‌కు గ్రామస్తులంతా కలిసి ఓ వీఐపీలా స్వాగతం పలికారు. ఏళ్ల తరువాత జరిగిన పెళ్లి కోసం ఊరంతా పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. 2017 తర్వాత ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఏ ఒక్క పెళ్లి జరగలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..