AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: అలా కొడైకెనాల్‌లో.. ఐఆర్‌సీటీసీ నుంచి తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే టూర్‌ ప్యాకేజ్‌

ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా సందర్శించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. మీరు కూడా ఇదే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే మీకోసమే ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఓ టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. చెన్నై కొడైకెనాల్‌ పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చారు...

IRCTC: అలా కొడైకెనాల్‌లో.. ఐఆర్‌సీటీసీ నుంచి తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే టూర్‌ ప్యాకేజ్‌
IRCTC
Narender Vaitla
|

Updated on: Feb 02, 2024 | 6:25 PM

Share

కొడైకెనాల్‌.. ఈ పేరు చెప్పగానే చల్లటి వాతావరణం, నీటి పరవళ్లు, సెలయేర్ల అందాలు గుర్తొస్తాయి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా సందర్శించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. మీరు కూడా ఇదే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే మీకోసమే ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఓ టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. చెన్నై కొడైకెనాల్‌ పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా కొడైకెనాల్‌, మదురై ప్రాంతాలు కవర్‌ అవుతాయి. ప్రతీ గురువారం ఈ టూర్‌ అందుబాటులో ఉంటుంది.

టూర్‌ ఇలా సాగుతుంది..

* మొదటి రోజు చెన్నై ఇగ్మోర్‌ స్టేషన్‌ నుంచి 16723 నెంబర్‌ అనంతపురి స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ 20.10 గంటలకు బయలు దేరుతుంది. దీంతో టూర్‌ ప్రారంభమవుతుంది.

* రెండో రోజు ఉయదం మదురై రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఉదయం 5 గంటలకు మధురై స్టేషన్‌కు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కొడైకెనాల్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ హోటల్‌లో చెకిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ గ్రీన్‌ వ్యాలీ, కాకర్స్‌ వాక్‌, పిల్లర్‌ వీక్షించవచ్చు.

* మూడో రోజు కోడైకెనాల్‌లో అప్పర్‌ లేక్‌ వ్యూ, బోట్‌ రైడ్స్‌, పైన్‌ ఫారెట్స్‌, గునా గుహలు, మ్యూజియం సందర్శించాల్సి ఉంటుంది. రాత్రి కోడైకెనాల్‌లోనే ఉండాల్సి ఉంటుంది.

* ఇక నాలుగో రోజు ఉదయం 9 గంటలకు కొడైకెనాల్‌ నుంచి హాటల్‌లో చెక్‌ అవుట్‌ కావాల్సి ఉంటుంది. అనంతరం మధురై వెళ్లి అక్కడ మీనక్షి అమ్మ ఆలయం, తిరుమలై నైకర్‌ మహల్‌ సందర్శన ఉంటుంది. తర్వాత 23.20 గంటలకు చెన్నైకి తిరుగు ప్రయాణం ఉంటుంది.

* ఇక టూర్‌లో చివరి రోజైన 5వ రోజు చెన్నై ఈగ్నోర్‌ స్టేషన్‌కు 7.55 గంటలకు చేరడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు..

ఇక ప్యాకేజీ ధరల విషయానికొస్తే.. డబుల్‌ ఆక్యూపెన్సీకి రూ. 12,000 ట్రిపుల్‌ ఆక్యూపెన్సీకి రూ. 9500, చైల్డ్‌ విత్‌ బెడ్‌కు రూ. 7200, చైల్డ్‌ విత్‌ అవుట్‌ బెడ్‌ రూ. 6210గా నిర్ణయించారు. ట్రైన్‌ జర్నీ, రెండు రాత్రుళ్లు అకామిడేషన్‌, అన్ని సైట్ విజిటింగ్స్‌, ట్రావెల్‌ ఇన్సురెన్స్ మొత్తం టూర్‌ ప్యాకేజీలోనే కవర్‌ అవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?