IRCTC: ఈ సీజన్‌లో ఊటీ వెళ్తే ఉంటుంది.. మీకోసమే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

మీలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ మంచి ప్యాకేజీని తీసుకొచ్చింది. తిరుపతి నుంచి ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నారు. 'అల్టీమేట్‌ ఊటీ ఎక్స్‌ తిరుపతి' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. మొత్తం 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్‌ ప్యాకేజీ ఉండనుంది. ఫిబ్రవరి 13వ తేదీన ఈ టూర్‌ అందుబాటులో ఉండనుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో..

IRCTC: ఈ సీజన్‌లో ఊటీ వెళ్తే ఉంటుంది.. మీకోసమే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
IRCTC Ooty Package
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 03, 2024 | 6:08 PM

ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఊటీ. ఈ ప్రాంతానికి ఒక్కసారైనా వెళ్లాలని చాలా మంది ఆశపడుతుంటారు. మీలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ మంచి ప్యాకేజీని తీసుకొచ్చింది. తిరుపతి నుంచి ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నారు. ‘అల్టీమేట్‌ ఊటీ ఎక్స్‌ తిరుపతి’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. మొత్తం 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్‌ ప్యాకేజీ ఉండనుంది. ఫిబ్రవరి 13వ తేదీన ఈ టూర్‌ అందుబాటులో ఉండనుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

టూర్‌ ఇలా సాగుతుంది..

* టూర్‌లో భాగంగా మొదటి రోజు తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి రాత్రి 11.50 గంటలకు 17230 నెంబర్‌ ట్రైన్‌, బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.

* రెండో రోజు ఉదయం 8.00 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఊటీకి చేరుకొని, హోటల్‌లో చెకిన్‌ అవుతారు. అనంతరం మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ సందర్శన ఉంటుంది. ఊటీ లేక్ చూసిన తర్వాత రాత్రి ఊటీలో బస చేయాల్సి ఉంటుంది.

* మూడో రోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ పూర్తి చేయగానే.. దొడబెట్ట, టీ మ్యూజియం, పైకరా వాటర్ ఫాల్స్‌ సందర్శన ఉంటుంది. మూడడో రోజు రాత్రి కూడా ఊటీలోనే ఉంటారు.

* 4వ రోజు టిఫిన్‌ చేసిన తర్వాత.. కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే ఉండాల్సి ఉంటుంది.

* ఇక 5వ రోజు హోటల్‌ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. అనంతరం సాయంత్రం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ 17229 రైలులో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

* చివరి రోజైన 6వ రోజు రాత్రి 12.05 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కి చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ఛార్జీలు ఇలా ఉంటాయి..

కంఫర్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ షేరింగ్‌ ధర రూ. 26,770గా నిర్ణయించారు. ఇక డబుల్‌ షేరింగ్‌కు రూ. 15,880కాగా ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.11,470గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు టికెట్‌ ధర ఉంటుంది. టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ టూర్‌ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌ సైట్‌ను చెక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్