IRCTC: విజయవాడ నుంచి షిరిడీ.. ఐఆర్‌సీటీసీ నుంచి బడ్జెట్ టూర్ ప్యాకేజ్..
ఈ క్రమంలోనే విజయవాడ నుంచి షిరిడీకి మంచి బడ్జెట్ ప్యాకేజీని అందిస్తున్నారు. 'సాయి సన్నిధి ఎక్స్-విజయవాడ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఇంతకీ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ఆపరేట్ అవుతుంది..
ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ పలు ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ఐర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే విజయవాడ నుంచి షిరిడీకి మంచి బడ్జెట్ ప్యాకేజీని అందిస్తున్నారు. ‘సాయి సన్నిధి ఎక్స్-విజయవాడ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఇంతకీ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ఆపరేట్ అవుతుంది. మొత్తం 3 రాత్రులు 4 రోజులు ఈ టూర్ ఉంటుంది. ప్రస్తుతం ఫిబ్రవరి 13వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందదుబాటులో ఉంది.
టూర్ ఇలా సాగుతుంది..
* టూర్ ప్యాకేజీలో భాగంగా తొలి రోజు రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 17208 నెంబర్ సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు బయలు దేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
* రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో షిరిడీకి చేరుకుంటారు. తర్వాత హోటల్‌లో చెకిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెషప్ అయ్యాక షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం రాత్రి షిరిడీలో రాత్రి బస ఉంటుంది.
* మూడవ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి తిరిగి షిరిడీలోని హోటల్‌కు చేరుకుంటారు. ఇక రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో విజయవాడకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
* 4వ రోజు తెల్లవారు జామున 3 గంటలకు విజయవాడకు చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇవీ..
కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 14,930 ధరకాగా, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 9,430, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 8,030గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా ఛార్జీలు నిర్ణయించారు. ఇక స్టాండర్డ్ క్లాస్ విషయానికొస్తే ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 5,170గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..