బరువు, బెల్లీ ఫ్యాట్‌ను కరిగించే బెస్ట్ డ్రింక్స్.. రోజూ తీసుకుంటే దెబ్బకు పొట్ట ఫ్లాట్..!
ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేటి ఆధునిక జీవన శైలీ, ఆహారపు అలవాట్ల కారణంగా ముందుకు సాగిన బెల్లీ ఫ్యాట్, అధిక బరువుతో తెగ సమస్యలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తుంటాయి. ఈ క్రమంలో మీ వంటింట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించి, బెల్లీ ఫ్యాట్, అధిక బరువుకు చెక్ పెట్టే అద్భుతమైన పానీయాలు తయారు చేసుకోవచ్చు..అవేంటో ఇక్కడ చూద్దాం..

నేటి ఆహారపు అలవాట్లు, దినచర్య మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తున్నాయి. ఇందులో వేగంగా పెరుగుతున్న బరువు కూడా అతి ముఖ్యమైనది. బరువు తగ్గడం విషయానికి వస్తే.. చాలా మంది కఠినమైన ఆహార నియమాలను అనుసరిస్తుంటారు. పెరిగిపోతున్న బరువును కంట్రోల్ చేసేందుకు కఠినమైన వ్యాయామాలు కూడా చేయాలని భావిస్తారు. కానీ, ఆయుర్వేదం శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గించడానికి కొన్ని ప్రభావవంతమైన పానీయాలను ప్రస్తావిస్తుందని మీకు తెలుసా? అవును, ఈ రోజు మనం అలాంటి ప్రత్యేక పానీయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ఇవి మీ బరువు తగ్గించే ప్రయత్నాన్ని మరింత ఈజీగా మార్చేస్తాయి.
మెంతినీరు: 1 టీస్పూన్ మెంతులు తీసుకుని 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం మరిగించి, వడకట్టి, గోరువెచ్చగా తాగేయాలి. ఇది మీ బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. మెంతిలోని ఫైబర్, ఇతర పోషకాలు మీ బరువును నియంత్రించడంలో, మీ చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
జీలకర్ర నీరు:
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర టీ (జీలకర్ర టీ) ని తాగడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. మీ జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. ఇది మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని చేయడానికి, ఒక కప్పు నీటిలో 1/2 టీస్పూన్ జీలకర్ర వేసి, నీరు సగానికి తగ్గే వరకు మరిగించండి. తరువాత, ఖాళీ కడుపుతో గోరువెచ్చగా తాగేయాలి.
దాల్చిన చెక్క నీరు:
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, శరీరానికి శక్తినివ్వడంతో పాటు దాల్చిన చెక్క నీరు కూడా బరువు తగ్గడానికి గొప్ప సహాయంగా ఉంటాయి. దాల్చిన చెక్క నీటిలో తేనె కలపడం వల్ల మీ కొవ్వును కరిగించే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. దీని తయారీ కోసం ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని మరిగించండి. తరువాత, ఒక టీస్పూన్ తేనెను ఆ మిశ్రమంలో కలిపి టీ లాగా తాగాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








