Avocado Face Mask: పొడి చర్మం వల్ల ముఖం నిర్జీవంగా మారిందా? మరేం పర్లేదు ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి
ఇప్పటికే వాతావరణంలో మార్పులు ప్రారంభమయ్యాయి. చలికాలం త్వరలో ప్రారంభం కానుంది. చలికాలం ప్రారంభంలో వీచే చల్లని గాలి చర్మం పొడిబారడాన్ని పెంచుతుంది. కొంతమందికి చలికాలం ముందు చర్మం మరింతగా పొడిబారుతుంటుంది. దీంతో చర్మం నిర్జీవంగా కనిపించడం ప్రారంభిస్తుంది. పొడి చర్మం చాలా కాలం పాటు కొనసాగాతే చర్మంపై ముడతల సమస్య త్వరగా మొదలవుతుంది. మరైతే చర్మాన్ని తేమగా ఉంచుకోవడం..

ఇప్పటికే వాతావరణంలో మార్పులు ప్రారంభమయ్యాయి. చలికాలం త్వరలో ప్రారంభం కానుంది. చలికాలం ప్రారంభంలో వీచే చల్లని గాలి చర్మం పొడిబారడాన్ని పెంచుతుంది. కొంతమందికి చలికాలం ముందు చర్మం మరింతగా పొడిబారుతుంటుంది. దీంతో చర్మం నిర్జీవంగా కనిపించడం ప్రారంభిస్తుంది. పొడి చర్మం చాలా కాలం పాటు కొనసాగాతే చర్మంపై ముడతల సమస్య త్వరగా మొదలవుతుంది. మరైతే చర్మాన్ని తేమగా ఉంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? చర్మంలో తేమను కాపాడుకోవడానికి మీరు అవకాడో ఫేస్ మాస్క్‌ను అప్లై చేయవచ్చు. పోషకాలు సమృద్ధిగా ఉండే అవకాడో పండు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముడతల సమస్య తొలగిపోతుంది. ఇది మచ్చలను పోగొట్టి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చలికాలంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అవకాడో ఫేస్ మాస్క్‌ను ట్రై చేయండి. అవకాడో ఫేస్ మాస్క్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
అవకాడో ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలంటే.. ముందుగా ½ అవకాడో గుజ్జును తీసుకోవాలి. దానికి ఒక కప్పు పెరుగు, కొన్ని చుక్కల తేనె, 1 టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముఖాన్ని శుభ్రంగా కడుగుకుని అవొకాడో ఫేస్ మాస్క్‌ను అప్లై చేయాలి. ఫేస్ ప్యాక్ 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీళ్లతో కడుక్కోవాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఈ ఫేస్ మాస్క్‌ని వారానికి రెండు మూడు సార్లు చర్మానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చర్మానికి అవకాడో వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
- అవకాడో చర్మానికి చాలా ప్రయోజనకరమైన పండు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
- అవకాడో సూర్యుని నుంచి వెలువడే హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
- అవకాడో ఫ్రూట్ ఫేస్ మాస్క్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం ముడతల సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది చర్మం మెరిసిపోయేలా చేయడంలో సహాయపడుతుంది.
- అవకాడోలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమల సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
- అవకాడో సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్లు, మోనోశాచురేటెడ్ కొవ్వులు చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.
- అవకాడోలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్లు, ఒలేయిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై నల్ల మచ్చల సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.