AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రపోయే ముందు ఫోన్ చూస్తున్నారా..అయితే ఈ తప్పులు చేస్తే చాలా ప్రమాదంలో పడే చాన్స్..

రాత్రి నిద్రపోయే ముందు అదే పనిగా ఫోన్ చూస్తున్నారా… అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే ఫోన్ చూడడం అనే అలవాటు, కేవలం మీ నిద్రను దూరం చేయడమే కాదు, అనేక ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది.

నిద్రపోయే ముందు ఫోన్ చూస్తున్నారా..అయితే ఈ తప్పులు చేస్తే చాలా ప్రమాదంలో పడే చాన్స్..
Sleepless
Madhavi
| Edited By: |

Updated on: Mar 29, 2023 | 7:27 AM

Share

రాత్రి నిద్రపోయే ముందు అదే పనిగా ఫోన్ చూస్తున్నారా… అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే ఫోన్ చూడడం అనే అలవాటు, కేవలం మీ నిద్రను దూరం చేయడమే కాదు, అనేక ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. అంటే మీరు ఆశ్చర్య పోవాల్సిందే.

ఈ మధ్య కాలంలో చాలా మంది పూర్తి సమయం స్మార్ట్ ఫోన్లలో వెబ్ షోలు, ఓటీటీ సినిమాలను చూస్తున్నారు. ‘జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్’ పేరుతో ప్రచురించిన పరిశోధన పత్రంలో సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల నిద్రపై ప్రభావం పడుతుందని వెల్లడించింది. పరిశోధన ప్రకారం, ఒక వ్యక్తి నిద్రపోయే ముందు సినిమాలు, టెలివిజన్ లేదా యూట్యూబ్ వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం లేదా బెడ్‌పై సంగీతం వినడం మానసిక , శారీరక ఆరోగ్యానికి చాలా హానికరబరి తేల్చింది.

ఈ అధ్యయనంలో, 58 మంది వ్యక్తుల రోజువారీ దినచర్య నమోదు చేశారు. వారు రోజుంతా గడిపిన సమయం, మొబైల్-ఇంటర్నెట్ వినియోగం , మల్టీ టాస్కింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని రికార్డ్ చేశారు. ఆ తర్వాత వారికి ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ పరీక్ష నిర్వహించారు. ఇది మెదడు కార్యకలాపాలను గుర్తించే పరికరం. దీని నుండి, వ్యక్తి , నిద్ర సమయం, మొత్తం నిద్ర సమయం , నిద్ర నాణ్యత వంటి ప్రమాణాల ఆధారంగా పనిచేస్తుంది. ఈ రీసెర్చ్‌లో బెడ్‌పై మొబైల్ వాడే వారికి సంబంధించి సీరియస్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

బెడ్‌పై మొబైల్‌తో సోషల్ మీడియాలో గడిపే వారు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తేలింది. ముఖ్యంగా పడుకునే ముందు స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాను ఎక్కువసేపు ఉపయోగించడం అనేది మీ నిద్ర సమయాన్ని తినేస్తుంది. తక్కువగా నిద్రపోతే అది శరీరంపై కూడా తీవ్రమైన పరిణామాలు చూపిస్తుంది. అలసట, ఒత్తిడి, ఆందోళన, బ్రెయిన్ స్ట్రోక్, కళ్లలోసమస్యలు ఉండవచ్చు. రోజంతా అలసటగా అనిపిస్తుంది. నిద్రలేమి కారణంగా రక్తపోటు, చక్కెర స్థాయిలు పెరగడం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖంపై టెన్షన్ పెరగడం వల్ల కళ్ల కింద ముడతలు, నల్ల మచ్చలు వంటివి వస్తాయి.

ఈ సమస్యపై, డెలావేర్ విశ్వవిద్యాలయం , ప్రధాన రచయిత మోర్గాన్ ఎలిథోర్ప్ మాట్లాడుతూ, “ప్రజలు పడుకునే ముందు 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే సోషల్ మీడియా, టీవీ చూడటం, సంగీతం వినడం చేయాలి. ఇది మీ నిద్ర సమయాన్ని మెరుగుపరుస్తుంది. మీ నిద్ర నాణ్యతపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు.

పడుకునే ముందు మొబైల్ వాడకండి:

8 గంటల నిద్ర మానవ శరీరానికి చాలా ముఖ్యమైనది. వైద్యుల ప్రకారం, నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం స్వయంగా రిపేర్ అవుతుంది. మన శరీరం , మనస్సు రెండింటికీ తగినంత నిద్ర అవసరం. అటువంటి పరిస్థితిలో, ప్రజలు నిద్రిస్తున్నప్పుడు మొబైల్ వాడకం , సోషల్ మీడియా స్క్రోల్ వంటి చెడు అలవాట్లను వదిలివేయాలి. పడుకునే ముందు మొబైల్ వాడకాన్ని తగ్గించండి. ఎల్లవేళలా స్క్రీన్ వైపు చూస్తూ ఉండటం వలన డిజిటల్ కంటి ఒత్తిడికి కారణం కావచ్చు, ఇది అస్పష్టమైన దృష్టి లేదా అంధత్వానికి దారితీస్తుంది. ఇది మన శరీరంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే..
ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే..