Toothache: పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌ పెట్టండి

కొన్ని హోం రెమెడీస్‌తో పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పంటి నొప్పికి లవంగం నూనె మంచి చిట్కా.. లవంగంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కాటన్ బాల్‌పై ఒకటి లేదా రెండు చుక్కల లవంగాల నూనె వేసి నొప్పి ఉన్న పంటిపై రాయండి..

Toothache: పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌ పెట్టండి
Toothache Remedies
Follow us

|

Updated on: Mar 28, 2023 | 8:57 PM

దంతక్షయం , బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.. ఇలా పలు కారణాల వల్ల పంటి నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దంతాల లోపల నరాలు, కణజాలాలు, రక్తనాళాలు చాలా మృదువుగా ఉండటమే దీనికి కారణం. అవి శరీరంలో అత్యంత సున్నితమైన నరాలు. ఈ నరాలు బ్యాక్టీరియా బారిన పడినప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. దీనిని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే దంతవైద్యుడిని సంప్రదించడం అవసరం. అయితే కొన్ని హోం రెమెడీస్‌తో పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పంటి నొప్పికి లవంగం నూనె మంచి చిట్కా.. లవంగంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కాటన్ బాల్‌పై ఒకటి లేదా రెండు చుక్కల లవంగాల నూనె వేసి నొప్పి ఉన్న పంటిపై రాయండి. ఇలా చేయడం వల్ల పంటి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

వెల్లుల్లి

నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెల్లుల్లిని రోజూ ఖాళీ కడుపుతో తినవచ్చు. వెల్లుల్లి తినడం వల్ల పంటి నొప్పి కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇది నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

పియర్ ఆకులు

పియర్ ఆకులు యాంటీమైక్రోబయల్ గుణాలతో నిండి ఉన్నాయి. ఇవి కావిటీస్‌ను నివారించడంలో మంచివి. పియర్ ఆకులను ఉడకబెట్టి మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు.

నిమ్మరసం

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆహారం తిన్న తర్వాత నిమ్మరసం తాగాలి. ఇది దంత క్షయాన్ని నివారిస్తుంది. దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?