AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rock Salt: ఆరోగ్యానికి మేలు చేసే ఉప్పు.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఆరోగ్యానికి ఉప్పు చేటు చేస్తుందని మనకు తెలుసు. నిపుణులు సైతం ఇదే చెబుతారు. ఉప్పును ఎంత తక్కువ తింటే అంత మంచిదని సూచిస్తారు. అయితే రాళ్ల ఉప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? సాల్ట్ కు బదులుగా ఈ రాళ్ల ఉప్పు వాడితే ఎంత మేలు జరుగుతుందో తెలుసుకుందాం రండి..

Rock Salt: ఆరోగ్యానికి మేలు చేసే ఉప్పు.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Rock Salt
Madhu
|

Updated on: Mar 28, 2023 | 4:00 PM

Share

మన తాతల కాలంలో అందరూ రాళ్ల ఉప్పునే వినియోగించే వారు. ఎందుకంటే సహజ పద్ధతుల్లో తయారైన ఆ ఉప్పు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దొరకుతున్న రసాయనాలు కలిపిన సాల్ట్ తో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. రాళ్ల ఉప్పును సాధారణంగా సముద్రం నుంచి తయారు చేస్తారు. సముద్రంలోని నీటిని మడుల్లో నిల్వ చేసి.. నీరు ఆవిరైన తర్వాత సోడియం క్లోరైడ్ కలిగిన గులాబి రంగు స్పటికలను దానిలో వేసినప్పుడు రాళ్ల ఉప్పు తయారవుతుంది. ఆయుర్వేదంలో, సేంద నమక్(రాళ్ల ఉప్పు) ను పురాతన కాలం నుండి ఔషధ గుణాలు కలిగిన పదార్థంగా పరిగణిస్తున్నారు. ఈ రాతి ఉప్పు సాధారణ దగ్గు, జలుబును నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కంటి చూపు, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

  • సేంద నమక్‌లో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్ వంటి శరీరానికి మేలు చేసే ఇతర ఖనిజాలు ఉన్నాయి. కానీ, ఈ పోషకాల కోసం దానిపై మాత్రమే ఆధారపడటానికి తగినంత పరిమాణంలో లేవని గమనించాలి.
  • తక్కువ సోడియం కంటెంట్ కారణంగా, సాధారణ ఉప్పు కంటే, సెంద నమక్ శరీరంలో సోడియం కంటెంట్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. సోడియం అధికంగా ఉన్నా.. లేక తక్కువగా ఉన్నా శరీరానికి హానికరమే.
  • దీనిలోని ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా, ఇది కండరాల తిమ్మిరికి, మన శరీరంలోని నరాల సరైన పనితీరుకు సహాయపడుతుంది. కానీ, ఎలక్ట్రోలైట్స్, కండరాల తిమ్మిరితో వాటి సంబంధం గురించి అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
  • ఆయుర్వేదం ప్రకారం, రాతి ఉప్పు జీర్ణక్రియకు సహాయపడుతుంది. మెరుగైన ప్రేగు ఆరోగ్యం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, డయేరియా మొదలైన వాటితో పోరాడటానికి సహాయపడుతుంది.
  • సెంద నమక్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆయుర్వేదం సూచిస్తుంది.
  • సంక్షిప్తంగా చెప్పాలంటే, సేంద నమక్ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..