AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Myths : ఆరోగ్య రక్షణ విషయంలో అవన్నీ అపోహలేనా? అవేంటో తెలుసుకోడానికి ఓ లుక్కెయ్యండి

ముఖ్యంగా ఆరోగ్య రక్షణకు సంబంధించిన సమాచారం విరివిగా అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో ఏది ఆరోగ్యానికి మంచిది? ఏది చెడ్డది? అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని పాటించే వారు ఉంటారు. అయితే ఏళ్ల తరబడి తప్పుడు సమాచారాన్నే నిజమని భావించి పాటించే వారు ఉన్నారు.

Health Myths : ఆరోగ్య రక్షణ విషయంలో అవన్నీ అపోహలేనా? అవేంటో తెలుసుకోడానికి ఓ లుక్కెయ్యండి
Myths
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 14, 2023 | 9:39 AM

Share

ప్రస్తుత కాలంలో సమస్త సమాచారం మన చేతుల్లోకే వస్తుంది. అయితే వచ్చిన సమాచారం అంతా నిజమే అనుకుంటే పొరపాటే అందులో కొన్ని అబద్ధాల కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య రక్షణకు సంబంధించిన సమాచారం విరివిగా అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో ఏది ఆరోగ్యానికి మంచిది? ఏది చెడ్డది? అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని పాటించే వారు ఉంటారు. అయితే ఏళ్ల తరబడి తప్పుడు సమాచారాన్నే నిజమని భావించి పాటించే వారు ఉన్నారు. మన ఆరోగ్యం కోసం మెరుగైన శ్రద్ధ తీసుకోవడం గొప్ప ఆలోచనే కానీ, బరువు తగ్గడం, బాగా తినడం, వ్యాయామం చేయడం వంటి ఆరోగ్య సంబంధిత లక్ష్యాల కోసం ఆరోగ్యానికి సంబంధించిన అలవాట్లు, ప్రవర్తనను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి కొన్ని ఆరోగ్య అపోహలను వదిలేయాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆ అపోహలు, నిజాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

అపోహ : పిండి పదార్థాలు చెడ్డవి

కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. అలాగే అనేక శారీరక ప్రక్రియలకు కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. శుద్ధి చేసిన చక్కెరలు వంటి కొన్ని రకాల పిండి పదార్థాలు పరిమితంగా ఉండాలి. అయితే, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయల నుంచి సంగ్రహించే కార్బోహైడ్రేట్లు మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనవి. పిండి పదార్థాలు ఆహారంలో శక్తివంతమైన పాత్ర పోషిస్తాయి. రోజంతా బాగా పనిచేయడానికి మన శరీరానికి పిండి పదార్థాలు అవసరమని గుర్తుంచుకోవాలి.

అపోహ : గ్లూటెన్ ఫ్రీ డైట్ ఆరోగ్యకరం

గ్లూటెన్ అసహనం ఉన్నవారికి గ్లూటెన్-ఫ్రీ డైట్‌లు అవసరం. అయితే గ్లూటెన్-ఫ్రీ డైట్ ప్రతి ఒక్కరికీ అంతర్లీనంగా ఆరోగ్యకరమైనది కాదని నిపుణులు చెబుతున్న మాట. కొన్ని గ్లూటెన్ రహిత ఉత్పత్తులు తరచుగా చక్కెరలో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్, పోషకాలు తక్కువగా ఉంటాయని గుర్తించాలి. కాబట్టి ఆరోగ్య కాంక్షతో ఎక్కువగా గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవడం మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

అపోహ : డీటాక్స్ డైట్‌తో శరీరం శుభ్రం

జ్యూస్ క్లీన్స్ వంటి డిటాక్స్ డైట్‌లకు శాస్త్రీయంగా మద్దతు లేదనే విషయం గుర్తించాలి. కాలేయం, మూత్రపిండాలు శరీరం సహజ నిర్విషీకరణలు, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి చర్యలతో వాటి పనితీరు పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అపోహ : సప్లిమెంట్స్‌తో త్వరిత పరిష్కారం

సప్లిమెంట్లు నిర్దిష్ట పోషక లోపాలను పరిష్కరించడంలో సహాయపడతాయి, అవి సమతుల్య, పోషకమైన ఆహారాన్ని భర్తీ చేయలేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంపూర్ణ ఆహారాల నుంచి పోషకాలను పొందడం మీ ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. 

అపోహ : అధిక కొవ్వు ఆహారాలతో గుండె సమస్యలు

కొవ్వు అనేది ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే వినియోగించే కొవ్వు రకం కీలకంగా ఉంటుంది. సంతృప్త, ట్రాన్స్ కొవ్వులు గుండె జబ్బులతో ముడిపడి ఉన్నాయి. అయితే గింజలు, చేపలలో కనిపించే అసంతృప్త కొవ్వులు గుండె ఆరోగ్యంపై రక్షిత ప్రభావాన్ని చూపుతాయి. అలాగే మెదడు పనితీరును మెరుగుపర్చి మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..