Zomato Food Delivery: జొమాటో 10 నిమిషాల ఇన్‌స్టంట్‌ సేవలపై కస్టమర్ల అపోహలు.. అసలు వాస్తవాలేంటంటే..

Zomato Food Delivery : ఆర్డర్‌ చేసిన 10 నిమిషాల్లోనే వినియోగదారులకు ఆహారాన్ని డెలివరీ చేస్తామంటూ ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) ఇటీవల ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Zomato Food Delivery: జొమాటో 10 నిమిషాల ఇన్‌స్టంట్‌ సేవలపై కస్టమర్ల అపోహలు.. అసలు వాస్తవాలేంటంటే..
Zomato
Follow us
Basha Shek

|

Updated on: Apr 08, 2022 | 4:55 PM

Zomato Food Delivery : ఆర్డర్‌ చేసిన 10 నిమిషాల్లోనే వినియోగదారులకు ఆహారాన్ని డెలివరీ చేస్తామంటూ ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) ఇటీవల ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జొమాటో సగటు డెలివరీ సమయం 30 నిమిషాలు చాలా ఎక్కువని, పోటీ ప్రపంచంలో వినియోగదారులకు త్వరగా ఫుడ్‌ను అందించడం ఎంతో అవసరమని అందుకే జొమాటో ఇన్‌స్టంట్‌ సేవలను ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్‌ గోయల్‌ (Deepinder Goyal) గత నెలలో ఒక ప్రకటన చేశారు. ఏప్రిల్‌ నుంచి గురుగ్రామ్‌లోని నాలుగు స్టేషన్లలో ప్రయోగాత్మకంగా జొమాటో ఇన్‌స్టంట్‌ సేవలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా జొమాటో చేసిన 10 మినిట్స్​లో డెలివరీ సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆర్డర్​ చేసిన 10 నిమిషాల్లోనే మనకు కావాల్సిన ఆహారం ఇంటికి చేరుతుందన్న ఆనందం కన్నా.. అనుమానాలకే ఈ ప్రకటన ఎక్కువ తావిచ్చింది. తాజా ఆహారాన్నే అందిస్తారా? లేకుంటే ఎప్పుడో వండి పెట్టిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి పంపిస్తారా? డెలివరీ ఏజెంట్ల భద్రతేమిటి? అంటూ నెటిజన్లు కూడా జొమాటో ప్రకటనను ఏకిపారేశారు.

10 మినిట్స్‌లో డెలివరీ..

కాగా జొమాటో ప్రకటించిన 10 మినిట్స్‌ డెలివరీ సేవలపై కస్టమర్లలో కొన్ని అపోహలున్న మాట వాస్తవమే. అందులో ముఖ్యమైనది డెలివరీ ఏజెంట్ల భద్రత..’ఇప్పుడున్న ట్రాఫిక్‌ చక్ర వ్యూహంలో ఆర్డర్‌ చేసిన 10 నిమిషాల్లోనే ఎలా ఫుడ్‌ డెలివరీ చేస్తారు? ఒకవేళ తప్పదనుకుంటే వారి కఠినమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు వేగంగా ఫుడ్‌ అందించాలనే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదాల బారిన పడవచ్చు’ అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక మరొకటి ఆహారం నాణ్యత.. ఆర్డర్‌ చేసిన 10 నిమిషాల్లోపు ఫుడ్ ఎలా రెడీ చేస్తారు? ఒకవేళ 10 నిమిషాల్లో తయరుచేసినా ట్రాఫిక్‌ ను దాటి కస్టమర్లకు ఎలా డెలివరీ చేస్తారు? అని అనుమానిస్తున్నారు. ఇప్పటికే చాలాచోట్ల డెలివరీపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న సమయంలో ఈ 10 నిమిషాల ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ డెలిరీకి ఎలాంటి అదనపు డబ్బులు వసూలు చేస్తారు? అని కొందరు కస్టమర్లు అడుగుతున్నారు. ఇక ప్రజలకు నిజంగా 10 నిమిషాలలోపు ఆహారం అవసరమా? ప్రస్తుతమున్న 30-40 నిమిషాల సమయం సరిపోదా? అని అడిగేవాళ్లు కూడా ఉన్నారు.

కాగా జొమాటో ఇన్‌స్టంట్‌ సేవలపై వస్తోన్న అనుమానాలు, సందేహాలు, అపోహలకు ఎప్పటికప్పుడు జొమాటో యాజమాన్యం వివరణలిస్తూ వస్తోంది. అలా 10 మినిట్స్‌ డెలివరీ సేవలపై కూడా ఆ సంస్థ సీఈవో దీపిందర్‌ గోయల్‌ సూటిగా వివరణ ఇచ్చారు. ఈ సేవలపై కస్టమర్లలో ఉన్న అపోహలు, అనుమానాలను తొలగించేలా ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు. అవేంటంటే..

ఆ వంటకాలకు మాత్రమే

ఆర్డర్​ చేసిన కస్టమర్‌ ఇంటికి అతిదగ్గర్లోని కొన్ని రెస్టారెంట్లు, అక్కడ లభించే కొన్ని వంటకాలకు మాత్రమే ఈ 10 నిమిషాల డెలివరీ సేవలు వర్తిస్తాయి . అదికూడా రెస్టారెంట్​2 నిమిషాల్లోనే అందించగల కొన్ని స్పెషల్‌ వంటకాలకు మాత్రమే జొమాటో ఇన్​స్టంట్​ వర్తిస్తుంది. ఉదాహరణకు.. మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, పోహా, కాఫీ, చాయ్, బిర్యానీ, మోమోస్ వంటివి.

ఎలాంటి జరిమానాలు ఉండవు..

ఇక 10 నిమిషాల డెలివరీల కారణంగా ఒక్కో ఆర్డర్​కు డెలివరీ బాయ్ రోడ్డుపై గడపాల్సిన సమయం తగ్గుతుంది. అయితే ట్రాఫిక్‌ నిబంధనలు, రహదారి భద్రతపై డెలివరీ ఏజెంట్లకు అవగాహన కల్పిస్తామని జొమాటో స్పష్టం చేసింది. వారికి ప్రమాద/జీవిత బీమా కూడా కల్పిస్తాం. ఇక డెలివరీ ఆలస్యమైతే వారికి ఎలాంటి పెనాల్టీలు, జరిమానాలు ఉండవు. ఇవే కాదు10, 30 నిమిషాల డెలివరీలను సకాలంలో పూర్తి చేసినా ఏజెంట్లకు ఎలాంటి ఇన్సెంటివ్స్​ ఉండవు. ఇక ఈ 10 మినిట్స్‌ సేవలపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. కస్టమర్లు సాధారణ ఛార్జీలే చెల్లించాల్సి ఉంటుందని జొమాటో స్పష్టం చేసింది.

ఇక 10 మినిట్స్‌ డెలివరీ సేవలు ఎలా ఉంటాయంటే..

‘*కిచెన్ ప్రిపరేషన్ టైమ్​: 2- 4 నిమిషాలు

*సగటు దూరం: 1-2 కిలోమీటర్లు

*ప్రయాణ సమయం: 3-6 నిమిషాలు(సగటున గంటకు 20కి.మీ వేగంతో) ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు కల్పించేందుకే ఈ ఇన్‌స్టంట్‌ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జొమాటో యాజమాన్యం చెబుతోంది. అందుకు తగ్గట్టే భారతదేశంలో చాలా సెన్సిటివ్‌ మార్కెట్‌. ఇక్కడ కస్టమర్లే దేవుళ్లు. వారి సంతృప్తి చెందితే ఎలాంటి స్టార్టప్‌లు, సేవలైనా సక్సెస్‌ అవుతాయి. లేకపోతే వారికి ఎన్నో ప్రత్యామ్నాయమార్గాలున్నాయి

(గమనిక: ఈ ఆర్టికల్‌ కేవలం ఫహద్ హాసిన్(Fahad Hasin) అనే రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. దీంతో టీవీ9, టీవీ9 తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రచురితం చేస్తున్నాం.)

Also Read: IPL 2022 CSK vs SRH Head to Head: ఇరుజట్ల రికార్డుల్లో చెన్నైదే ఆధిపత్యం.. హైదరాబాద్‌కు మరోసారి ఓటమి తప్పదా..

Manchu Vishnu: సన్నీ లియోన్‏ను చూసి భయపడి పారిపోయిన మంచు విష్ణు.. నెట్టింట్లో వైరలవుతున్న వీడియో..

Akira Nandan: అకీరాకు బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..