AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: సన్నీ లియోన్‏ను చూసి భయపడి పారిపోయిన మంచు విష్ణు.. నెట్టింట్లో వైరలవుతున్న వీడియో..

వైవిధ్యభరితమైన సినిమాలను ఎంచుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మంచు విష్ణు..

Manchu Vishnu: సన్నీ లియోన్‏ను చూసి భయపడి పారిపోయిన మంచు విష్ణు.. నెట్టింట్లో వైరలవుతున్న వీడియో..
Manchu Vishnu
Rajitha Chanti
|

Updated on: Apr 08, 2022 | 3:45 PM

Share

వైవిధ్యభరితమైన సినిమాలను ఎంచుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మంచు విష్ణు (Manchu Vishnu).. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులు అలరిస్తున్నాడు మంచువారబ్బాయి. ఇటీవల మోసగాళ్లు మూవీతో థియేటర్లలో సందడి చేశాడు విష్ణు. అయితే భారీ బడ్జెట్‏తో తెరకెక్కించిన ఈ సినిమా ఆశించనంతగా హిట్ కాలేకపోయింది. దీంతో గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా గాలి నాగేశ్వరరావు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసాడు విష్ణు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసింది.

ఇందులో సన్నీ లియోన్ రేణుక అనే ఎన్నారై పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‏లో సన్నీ లియోన్ పాల్గొంటుంది. ఈ క్రమంలో సెట్‏లో మంచువిష్ణును ఆటపట్టించాలనుకుంది సన్నీ. ఆమె గోడ చాటున మాస్క్ ధరించి దాక్కొని ఉండగా.. పక్కనే మంచు విష్ణు వస్తున్నాడు. తన దగ్గరి వరకు రాగానే మంచు విష్ణును భయపెట్టాలనుకుంది. అయితే మంచు విష్ణు సన్నీ లియోన్ ను ఫేస్ మాస్కులో చూసి భయపడడు.. ఫేస్ మాస్క్ తీసిన తర్వాత సన్నీ ని చూసి భయంతో పరుగులు పెట్టాడు. అతని వెనకాలే సన్ని లియోన్ సైతం పరుగులు తీసింది. ఈ ఫన్నీ వీడియోను సన్నీ లియోన్ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. నా ప్రయత్నం మళ్లీ ఒకసారి విఫలమయ్యింది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

Also Read: Ghani Movie Review: గెలవాలనుకున్న వాడి కథ ‘గని’..

Mahesh Babu: ఒకే రోజు 30 మందికి ప్రాణ దానం.. మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్‌..

Vaani Kapoor: సోషల్ మీడియాలో ఫోటో షూట్స్‌తో దుమారం రేపుతున్న నాని హీరోయిన్

Sarkaru Vaari Paata: మహేష్ మూవీకి పోటీగా మార్వెల్.. సర్కారు వారి పాట టైమ్‌లోనే ఆ హాలీవుడ్ సినిమా