Ghani Movie Review: గెలవాలనుకున్న వాడి కథ ‘గని’..

అప్పుడెప్పుడో ఎఫ్‌2, ఆ వెంటనే గద్దలకొండ గణేష్‌... ఆ తర్వాత? వరుణ్‌ చేస్తున్న గని గురించి వరుసగా న్యూస్‌.. కోవిడ్‌ టైమ్స్ లో

Ghani Movie Review: గెలవాలనుకున్న వాడి కథ 'గని'..
Ghani
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 08, 2022 | 2:22 PM

అప్పుడెప్పుడో ఎఫ్‌2, ఆ వెంటనే గద్దలకొండ గణేష్‌… ఆ తర్వాత? వరుణ్‌ చేస్తున్న గని గురించి వరుసగా న్యూస్‌.. కోవిడ్‌ టైమ్స్ లో సిల్వర్‌ స్క్రీన్‌ రిలీజుల్లేవు వరుణ్‌తేజ్‌కి. అందుకే మెగా ప్రిన్స్ చేసిన గని కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు స్పోర్ట్స్ మూవీస్‌ ని ఇష్టపడేవాళ్లందరూ వెయిటింగ్‌. ఇప్పటికి ఆ రోజు రానే వచ్చింది. ఇంతకీ గని ఎలా ఉంది? బాక్సింగ్‌ రింగ్‌లో వరుణ్‌ ఎలా చేశారు? ఉపేంద్ర ఏం చేశారు? సునీల్‌ శెట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చదివేయండి…

సినిమా: గని

రచన – దర్శకత్వం: కిరణ్‌ కొర్రపాటి

నిర్మాతలు: సిద్ధు ముద్ద, అల్లు బాబీ

నటీనటులు: వరుణ్‌తేజ్‌, సాయి మంజ్రేకర్‌, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌చంద్ర, నరేష్‌, నదియ, తనికెళ్ల భరణి, తమన్నా తదితరులు

కెమెరా: జార్జ్ సి విలియమ్స్

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌

సంగీతం: ఎస్‌. థమన్‌

విడుదల: ఏప్రిల్‌ 8, 2022

గని (వరుణ్‌తేజ్‌) చదువుకుంటుంటాడు. అతనికి బాక్సింగ్‌ అంటే ఇష్టం. అతని తల్లి (నదియ)కి, కొడుకు బాక్సింగ్‌ వైపు వెళ్లడం ఇష్టం ఉండదు. అయితే తల్లికి తెలియకుండా బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తాడు గని. తల్లికి ఇష్టం లేని పని అని తెలిసినా, తన తండ్రి విక్రమాదిత్య (ఉపేంద్ర) మీద ఉన్న కోపంతో కసిగా ఎదగాలనుకుంటాడు. కానీ ఒకసారి స్టేట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఉన్నప్పుడు తల్లికి తెలిసిపోతుంది. అప్పుడు గని ఏం చేశాడు? ఆ రింగులో ఓడిన గనికి విక్రమాదిత్య గురించి తెలిసిన నిజమేంటి? విజేందర్‌ సిన్హా (సునీల్‌ శెట్టి) వల్ల గని తెలుసుకున్నదేంటి? ఇంతకీ విక్రమాదిత్యకు ఈశ్వర్‌నాథ్‌ (జగపతిబాబు)కు ఉన్న సంబంధం ఎలాంటిది? మాయా (సాయి మంజ్రేకర్‌) ప్రేమను గని యాక్సెప్ట్ చేశాడా? లేదా? ఆది (నవీన్ చంద్ర) వల్ల గనికి నష్టం జరుగుతుందా? లాభం కలుగుతుందా? వంటివన్నీ తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.

వైజాగ్‌లాంటి ప్లేస్‌లో, మొక్కలు పెంచుకుంటూ, కొడుకును కంటికి రెప్పలా కాపాడుకునే సింగిల్‌ పేరెంట్‌గా నదియా పర్ఫెక్ట్ గా కనిపించారు. 15 ఏళ్లుగా తల్లి పడుతున్న బాధను అర్థం చేసుకునే కొడుకు పాత్రలో వరుణ్‌తేజ్‌ నటన బావుంది. బాక్సర్‌గా రింగులో వరుణ్‌ పర్ఫెక్ట్ గా కనిపించారు. బాక్సింగ్‌కి కావాల్సిన ట్రైనింగ్‌ తీసుకునే షాట్‌లు, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ మెప్పించాయి. వరుణ్‌ కి తగ్గ జోడీగా సాయి మంజ్రేకర్‌ కనిపించారు. తనికెళ్ల భరణి, సాయి మంజ్రేకర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు బావున్నాయి. బాక్సింగ్‌ కోసం ఉపేంద్ర పడే తపన నేచురల్‌గా అనిపించింది. ఐబీయల్‌ నిర్వాహకుడిగా జగపతిబాబు యాటిట్యూడ్‌ పర్ఫెక్ట్ గా కుదిరింది. రఘుబాబుకి ఈశ్వరా అనే మేనరిజం బావుంది. సునీల్‌ శెట్టి కేరక్టర్‌ పాజిటివ్‌గా సాగింది. సెకండాఫ్‌లో బాక్సింగ్‌ రింగ్‌లో సునీల్‌శెట్టి, ఉపేంద్ర మధ్య జరిగే బాక్సింగ్‌ ఇంట్రస్టింగ్‌ గా ఉంది.

రోమియో జూలియట్‌ పాట సినిమాతో సాగిపోతుంది. కొడ్తేలో తమన్నా అప్పియరెన్స్ యూత్‌కి ఐ ఫీస్టే. గని యాంథెమ్‌ ఇన్‌స్పయిరింగ్‌గా సాగుతుంది. చాలా సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రాణం పోసింది. ఊహకు అందే సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే వల్ల ఎక్కడో కాస్త కిక్‌ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది ప్రేక్షకుడికి. సరదాగా ఇన్‌స్పయిరింగ్‌ స్టోరీ చూడాలనుకునే వారికి గని తప్పక నచ్చుతుంది.

Also Read: Ram Gopal Varma: అతనో పానకంలో పుడక .. అతని గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ అన్న ఆర్జీవీ..

Jr NTR: అ‘ధర’హో.. ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ మీట్‌లో జూనియర్‌ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే దిమ్మ దిరగాల్సిందే..

Akhil Akkineni: అక్కినేని ఫ్యాన్స్‌కు నిరాశ.. సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పిన నిర్మాత..

Mahesh Babu : బాలీవుడ్ ఎంట్రీ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్.. మహేష్ అన్సార్ వింటే మతిపోవాల్సిందే