AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: అక్కినేని ఫ్యాన్స్‌కు నిరాశ.. సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పిన నిర్మాత..

Akhil Akkineni: అక్కినేని నట వారసుడు అఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఏజెంట్‌ (Agent). మొన్నటి వరకు లవర్‌ బాయ్‌గా కనిపించిన అఖిల్‌ ఈ సినిమాలో పూర్తిగా తన మేకోవర్‌ను మార్చేశాడు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఒక్కసారిగా అభిమానులను..

Akhil Akkineni: అక్కినేని ఫ్యాన్స్‌కు నిరాశ.. సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పిన నిర్మాత..
Akhil Latest Movie
Narender Vaitla
|

Updated on: Apr 08, 2022 | 8:28 AM

Share

Akhil Akkineni: అక్కినేని నట వారసుడు అఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఏజెంట్‌ (Agent). మొన్నటి వరకు లవర్‌ బాయ్‌గా కనిపించిన అఖిల్‌ ఈ సినిమాలో పూర్తిగా తన మేకోవర్‌ను మార్చేశాడు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఒక్కసారిగా అభిమానులను ఫిదా చేశాడు. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు (శుక్రవారం) అఖిల్‌ బర్త్‌డే. దీంతో ఇప్పటి వరకు ‘ఏజెంట్‌’ నుంచి ఒక్క అప్‌డేట్‌ కూడా రాకపోవడంతో అఖిల్‌ ఫ్యాన్స్‌.. కనీసం ఈ రోజైనా టీజర్‌ వస్తుందని ఎదురు చూశారు. అయితే అందరి ఆశలపై నీళ్లు జల్లుతూ ఓ ప్రకటన చేశాడు నిర్మాత అనిల్‌ సుంకర.

అఖిల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూనే ఏజెంట్‌ నుంచి టీజర్‌ను విడుదల చేయడం లేదని తేల్చి చెప్పేశారు. ఈ విషయమై అనిల్‌ ట్వీట్ చేస్తూ.. ‘ఈ రోజు ‘ఏజెంట్’ టీజర్ విడుదల చేయలేక పోతున్నందుకు అక్కినేని ఫ్యాన్స్‌కు క్షమాపణాలు చెబుతున్నాను. మీ ఎదురు చూపులకు న్యాయం చేసేలా ది బెస్ట్‌ ఇవ్వాలనుకుంటున్నాం. మే నెలలో అత్యుత్త క్వాలిటీతో కూడిన టీజర్‌ను విడుదల చేస్తామని హామీ ఇస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ రోజు ఏజెంట్ నుంచి కచ్చితంగా అప్‌డేట్‌ వస్తుందని ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే అఖిల్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన నిర్మాత.. ‘మా ఏజెంట్‌ అఖిల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. వచ్చే ఏడాది మీకు విజయాన్ని, స్టార్‌డంను అందించాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్లీ నేచర్, డెడికేషన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరెస్టు అంత ఎత్తులో నిలబెడుతుంది’ అంటూ రాసుకొచ్చారు.

ఇక వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్‌ 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో అఖిల్‌ స్పైగా కనిపించనున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలనే కసితో ఉన్న అఖిల్‌కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Also Read: Karma Siddhanta: నీ కోసం 14 ఏళ్ళు ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చిందని అడిగిన తల్లి ప్రశ్నకు కృష్ణడు చెప్పిన కర్మ ఫలితం

New Ministers: ఏపీ కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణలో చోటు దక్కేది ఎవరికంటే.. సామాజిక కోణంలో

Sri Lanka Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక.. ప్రధాని ఇంటి దగ్గర హైటెన్షన్‌