AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: అతనో పానకంలో పుడక .. అతని గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ అన్న ఆర్జీవీ..

రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా సినిమా డేంజరస్. తెలుగులో 'మా ఇష్టం'  , హిందీలో 'ఖత్రా' అనే టైటిల్ తో విడుదలవుతున్న ఈ సినిమాకు అనుకోని చిక్కులు ఎదురవుతున్నాయి.

Ram Gopal Varma: అతనో పానకంలో పుడక .. అతని గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ అన్న ఆర్జీవీ..
Rgv
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2022 | 8:20 AM

Share

రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) రూపొందించిన తాజా సినిమా డేంజరస్(Dangerous). తెలుగులో ‘మా ఇష్టం’  , హిందీలో ‘ఖత్రా’ అనే టైటిల్ తో విడుదలవుతున్న ఈ సినిమాకు అనుకోని చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా విడుదలపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ చిత్రం శుక్రవారం విడుదల నేపథ్యంలో సీనియర్ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు.  వర్మ తీసిన కొన్ని చిత్రాలకు ఆయనతో కలసి నట్టి కుమార్ భాగస్వామ్యం వహించడంతో పాటు కొన్ని సినిమాలకు తన స్నేహితులతో కలసి తాను కొంత డబ్బును ఫైనాన్స్ చేశారు. అయితే ఎన్నోమార్లు తమకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి వర్మ దగ్గర ప్రస్తావించినా లాభం లేకపోయిందని, ఎంతసేపు తప్పించుకుని తిరుగుతూ డబ్బులను ఎగగొట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు అర్ధమైందని నట్టి కుమార్ వెల్లడించారు. తనకు, తన స్నేహితులకు కలుపుకుని దాదాపు 5 కోట్ల 29 లక్షల రూపాయలు వర్మ బాకీ ఉన్నారని, తమకు రావలసిన ఈ డబ్బుల కోసం ఎంతోకాలం ఎదురుచూసి, కొన్ని సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రతీ సినిమాకు విడుదలకు ముందు 50 లక్షల రూపాయలు ఇస్తానని డాక్యూమెంట్ రాసి ఇచ్చిన వర్మ, చివరకు దానిపై కూడా నిలబడకుండా, 10 లక్షలు ఇస్తానంటూ, మా ఇష్టం సినిమా విడుదలకు ముందు రోజు వరకు ఆ ఊసే ఎత్తకుండా తన సినిమాను విడుదల చేసే పనిలో ఉండటంతో ఇక లాభం లేదనుకుని ఫిలిం చాంబర్స్ కు లెటర్స్ పెట్టినా ఫలితం లేకపోవడంతో తాను కోర్టుకు వెళ్లడం జరిగిందని అన్నారు. ఆ మేరకు కోర్టు మా ఇష్టం సినిమా విడుదలపై స్టే విధించిందని నట్టి కుమార్ చెప్పారు.

వర్మ తీసిన ” లఢఖీ” చిత్రంపై కూడా నట్టి కుమార్ ఇదివరకు స్టే తెచ్చిన విషయం తెలిసిందే. తమలాగే వర్మ బాధితులు ఎందరో ఉన్నారని, అయితే వాళ్ళు బయటకు రాలేదని, తాను మాత్రమే దైర్యంగా ఆయన చేస్తున్న మోసాలను బయట పెడుతున్నట్లు నట్టి కుమార్ వివరించారు. అనేక సినీ యూనియన్ల వారికి కూడా ఆయన బాకీ ఉన్నారని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో కలసి సినిమాలు చేసి, వారిని ఆర్ధికంగా మోసగించడం వర్మ పనిగా పెట్టుకున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ వదిలి, ముంబై, ఆ తర్వాత ముంబై వదిలి తిరిగి హైదరాబాద్, గోవా చేరుకుని ఇక్కడి వాళ్ళను మోసగిస్తున్నారని ఆయన చెప్పారు. వర్మ ఎక్కడ చర్చకు వస్తాను అన్నా తాను సిద్ధమని నట్టి కుమార్ సవాల్ విసిరారు. ఒక వైపు కోర్టు మా ఇష్టం సినిమా విడుదలపై స్టే విధిస్తే, తాము సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు వర్మ చెప్పుకోవడాన్ని బట్టి ఆయన ఎలాంటి వ్యక్తి అన్నది అందరికీ అర్థమవుతోందని నట్టి కుమార్ అన్నారు. దీనిపై వర్మ సంధిస్తూ.. నట్టి కుమార్ అనే వ్యక్తి నా పై చేసిన అభియోగాల గురించి నేను పట్టించుకోను.. నా లాయర్ లు చూసుకుంటారు. ప్రెస్ మీట్ లు పెట్టడం వాళ్ళని వీళ్ళని తిట్టడం తప్ప అతని లైఫ్ లో ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. చిరంజీవి గారి మీద ఒకసారి.. సురేష్ బాబు మీద ఒకసారి.. ఇప్పుడు నామీద .. ఇలా తన లైఫ్ అంత ప్రెస్ మీట్ లే ఉంటాయి. ఇప్పుడు తన కొడుకు, కూతురితో సినిమా చేస్తే ప్రమోషన్ చేయలేదనో.. రావల్సిన కమీషన్‌ రాలేదని కొందరిని ఆయన దూషించాడని వర్మ అన్నారు. ఇక తన సినిమా ‘మా ఇష్టం’ విడుదల వాయిదాకు నట్టికుమార్ కారణం కాదని, వేరే కారణం ఉందన్నారు. లెస్బియన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాను ప్రదర్శించేందుకు చాలా థియేటర్లు ముందుకు రావడం లేదని, దీనిపై లీగల్‌గా ఫైట్ చేసేందుకే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. నట్టి కుమార్‌కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కాబట్టి ఆయన గురించి ఇకపై ఎక్కడా మాట్లాడనని వర్మ చెప్పుకొచ్చారు. ఈమేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: హిందీలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల జాతర.. కొవిడ్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో సినిమాగా..

Anasuya Bharadwaj: కుర్రకారు గుండెలను కొల్లగొడుతున్న యాంకరమ్మ గ్లామర్ షో.. తగ్గేదేలే అంటున్న అను

Sreemukhi: ఖతర్నాక్ పోజులతో కైపెక్కిస్తున్న శ్రీముఖి.. యాంకరమ్మ అందాలకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్