AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: హిందీలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల జాతర.. కొవిడ్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో సినిమాగా..

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోంది. మార్చి 25న గ్రాండ్‌గా రిలీజైన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

RRR Movie: హిందీలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల జాతర.. కొవిడ్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో సినిమాగా..
Rrr
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 12, 2022 | 1:36 PM

Share

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోంది. మార్చి 25న గ్రాండ్‌గా రిలీజైన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan), యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్ (JR.NTR)ల అభినయాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. అందుకే సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు చేసిందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. కాగా హిందీ వెర్షన్‌ లోనూ ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు (ఏప్రిల్‌6) రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. తద్వారా కొవిడ్‌ తర్వాత విడుదలైన చిత్రాల్లో రూ.200 కోట్ల మార్కుకు చేరుకున్న రెండో చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ల అద్భుతమైన నటన, రాజమౌళి టేకింగ్‌ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయని, దీనికి తోడు బాలీవుడ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌కు పోటీనిచ్చే చిత్రాలు లేకపోవడంతో భారీ వసూళ్లు వస్తున్నాయని ట్వీట్‌లో రాసుకొచ్చారు తరుణ్‌.

కశ్మీర్ ఫైల్స్ తర్వాత..

కాగా కశ్మీర్‌ పండిట్ల ఊచకోత, వలసల నేపథ్యంలో వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ కూడా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం రూ.250 కోట్ల మార్కుకు చేరువలో ఉన్నట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా గతేడాది అల్లు అర్జున్‌ నటించిన పుష్ప కూడా హిందీలో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు జక్కన్న సినిమా కూడా కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కాగా ప్రముఖ మూవీ డేటా బేస్‌ సంస్థ IMDBలో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాలో టాప్ 5 లో నిలిచిన ఏకైక ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రముఖ ఆన్‌లైన్‌ టికెట్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షో రేటింగ్‌లోనూ టాప్‌ పొజిషన్‌ లో నిలిచింది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ సీత పాత్రలో సందడి చేయగా, ఓలీవియా మోరీస్‌ మరో హీరోయిన్‌గా నటించింది. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియాశరణ్‌, సముద్రఖని అతిథి పాత్రల్లో మెప్పించారు.

Also Read:Big News Big Debate: పదవులపై జగన్‌ వ్యూహం సరైందేనా ?? | టీమ్‌ 2024.. లైవ్ వీడియో

మోడ్రన్ డ్రస్సులో అలరిస్తున్న శ్రద్ధా దాస్

KTR fire on PM: చాయ్ పే చర్చ కాకుండా పెట్రోల్ ధరలపై చర్చ జరగుతోంది.. ప్రధానిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం