AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: అ‘ధర’హో.. ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ మీట్‌లో జూనియర్‌ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే దిమ్మ దిరగాల్సిందే..

Jr NTR: సెలబ్రిటీల లైఫ్‌ స్టైల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్రస్‌ల నుంచి కార్ల వరకు ప్రతీది డిఫ్రెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలోనే కాస్ట్‌లీ వస్తువులను ఉపయోగించడంలో ఆసక్తి చూపిస్తారు. ఇలా సెలబ్రిటీలు ధరించే వస్తువులకు...

Jr NTR: అ‘ధర’హో.. ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ మీట్‌లో జూనియర్‌ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే దిమ్మ దిరగాల్సిందే..
Narender Vaitla
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 08, 2022 | 11:41 AM

Share

Jr NTR: సెలబ్రిటీల లైఫ్‌ స్టైల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్రస్‌ల నుంచి కార్ల వరకు ప్రతీది డిఫ్రెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలోనే కాస్ట్‌లీ వస్తువులను ఉపయోగించడంలో ఆసక్తి చూపిస్తారు. ఇలా సెలబ్రిటీలు ధరించే వస్తువులకు సంబంధించిన వార్తలు నిత్యం టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతుంటాయి. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో అందుబాటులోకి వచ్చిన వచ్చిన తర్వాత సెలబ్రిటీలు ఉపయోగించే వస్తువుల ధరలు తెలుసుకోవాలనే ఆతృత అందరిలోనూ పెరిగిపోతోంది. ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేసి వెంటనే తమ అభిమాన హీరో వస్తువులను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇలా కాస్ట్‌లీ వస్తువులు ఉపయోగించే వారిలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మొదటి వరుసలో ఉంటారు. కార్ల నుంచి మొదలు వాచ్‌ల వరకు ఎన్టీఆర్‌ ఉపయోగించే వస్తువులకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న సమయంలో ఎన్టీఆర్‌ ధరించిన వాచ్‌ ధరపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్‌ ధరించిన వాచ్‌ పేరు Patek Philippe Nautilus 5712 1/A. ఇంగ్లండ్‌కు చెందిన ఈ బ్రాండెడ్‌ వాచ్‌ ధర అక్షరాల రూ. కోటి 70 లక్షల పైమాటే.

Ntr Watch

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ ఇలాంటి కాస్ట్‌లీ వాచ్‌ను వాడడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్‌ రిచర్డ్ మిల్లే RMకు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ ధ‌రించాడు. రూ. నాలుగు కోట్ల విలువైన వాచ్‌కు సంబంధించిన వార్తలు అప్పట్లో తెగ వైరల్‌ అయ్యాయి. ఒక్క వాచ్‌ ధర రూ. నాలుగు కోట్లు ఏంటని నెటిజన్లు ముక్కున వేలు వేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌తో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.

Also Read: Russia Suspended: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు ఎదురుదెబ్బ.. మానవ హక్కుల మండలిలో సభ్యత్వం రద్దు!

Flipkart Health Plus: మందుగోలీలు అమ్మేందుకు సిద్ధమైన ఫిప్ కార్ట్.. ప్రత్యేకంగా యాడాన్ సర్వీసులు కూడా..

Viral Video: సూట్ వేసుకొని పానీపూరి అమ్ముతున్న యువకులు.. కారణమేంటో తెలిస్తే షాకే..