Upendra : ‘అతడికి..ఇతడికి సంబంధమే లేదు’.. గని ఈవెంట్‌లో ఉపేంద్ర ఆసక్తికర కామెంట్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీగని . కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు బాబీ కంపెనీ నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej )లేటెస్ట్ మూవీ గని. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు బాబీ కంపెనీ నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలోని పాటలకు, ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరిని ఆకట్టుకుంటుంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర( Upendra), నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల గని సినిమాకు సంబంధించిన రిలీజ్ పంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో మెగా అభిమానులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి మంజ్రేకర్ తో పాటు కన్నడ స్టార్ హీరో ఉపెంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, చిత్ర దర్శక నిర్మాతలు, తదితరలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపెంద్ర మాట్లాడుతూ..
గత 24 ఏళ్లుగా నేను తెలుగువారందరికీ బాగా తెలుసు. హీరో రాజశేఖర్ తో దాదాపు పాతికేళ్ల క్రితం ‘ఓంకారం’ అనే సినిమా డైరెక్ట్ చేశాను. ఆ సమయంలో చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి అశ్వినీదత్ గారు నిర్మాత. కానీ నేను ఆ చిత్రాన్ని చేయలేకపోయాను అన్నారు. చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాను. ఆ సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికి బాధపడుతుంటాను. ఆ తర్వాత ఒక్కమాట చిత్రంలో వరుణ్ తేజ్ ఫాదర్ నాగబాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. కొన్నేళ్ల క్రితం అల్లు అర్జున్ చిత్రం సన్నాఫ్ సత్యమూర్తిలో కీలక పాత్రలో నటించాను. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం చూశాను. ఆ సినిమాలో వరుణ్ తేజ్ కి.. ఇప్పుడు చూస్తున్న వరుణ్ తేజ్ అసలు సంబంధం లేదు అన్నట్లుగా అనిపిస్తోంది. అద్భుతమైన మేకోవర్ అంటూ ఉపేంద్ర ప్రశంసించారు. మొత్తానికి మెగా ఫ్యామిలీతో మంది సంబంధం ఉందని ఉపేంద్ర చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :