Happy Birthday Allu Arjun: కెరీర్ బిగినింగ్ నుంచి క్రేజ్ తగ్గిందే లే.. ఇండస్ట్రీకి ‘సరైనోడు’
మెగాస్టార్ అల్లుడు.. పద్మశ్రీ అల్లు రామలింగయ్యగారి మనవడు.. అల్లు అరవింద్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అల్లు అర్జున్(Allu Arjun).
మెగాస్టార్ అల్లుడు.. పద్మశ్రీ అల్లు రామలింగయ్యగారి మనవడు.. అల్లు అరవింద్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అల్లు అర్జున్(Allu Arjun). చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన బన్నీ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు. మెగాస్టార్ నటించిన విజేత సినిమాలో చిన్న పాత్రలో మొదటిసారి నటించాడు బన్నీ. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యంలో అలాగే చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఓ పాత్ర చేశాడు. ఆతర్వాత దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తెరకెక్కించిన ఆర్య సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఆర్య సినిమాతో ఒక్కసారిగా యూత్ లో బన్నీకి మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత బన్నీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయాడు. తన స్టైల్ తో యాటిట్యూడ్ తో స్టైలిష్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ కు కేవలం మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా కేరళలో.. అక్కడ బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు ఫ్యాన్స్. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అల్లు అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఇక ఇటీవలే విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. బన్నీకి ఉన్న ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగే థియేటర్స్ దగ్గర పాలాభిషేకాలు, పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలు అంటూ.. హడావిడి చేస్తుంటారు, ఇక నేడు బన్నీ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు, సినీప్రముఖులు అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :