Flipkart Health Plus: మందుగోలీలు అమ్మేందుకు సిద్ధమైన ఫిప్ కార్ట్.. ప్రత్యేకంగా యాడాన్ సర్వీసులు కూడా..

Flipkart Health Plus: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ హెల్త్‌కేర్(Health Sector) రంగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది

Flipkart Health Plus: మందుగోలీలు అమ్మేందుకు సిద్ధమైన ఫిప్ కార్ట్.. ప్రత్యేకంగా యాడాన్ సర్వీసులు కూడా..
Flipkart Health Plus
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 07, 2022 | 8:51 PM

Flipkart Health Plus: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ హెల్త్‌కేర్(Health Sector) రంగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్‌ పేరుతో దీనిని ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా దేశంలోని 20 వేలకు పైగా పిన్‌కోడ్‌లలోని ప్రాంతాలకు సర్వీసులను అందజేయాలని ఫ్లిప్‌కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిప్‌కార్ట్ లాంచ్ చేసిన హెల్త్ ప్లస్ యాప్.. అపోలో 24×7, టాటా 1ఎంజీ, ఫార్మ్‌ఈజీ, నెట్‌మెడ్స్‌(Netmeds)కు గట్టి పోటీగా నిలవనుంది. ఈ దిగ్గజ కంపెనీ కస్టమర్లకు అద్బుతమైన ఆఫర్లను అందించే అవకాశం ఉంది. ఈ యాప్ ద్యారా థర్డ్ పార్టీ సెల్లర్ల మందులను, హెల్త్‌కేర్ వస్తువులను ఆఫర్ చేయనుంది. రిజిస్టర్డ్ ఫార్మాసిస్టుల నెట్‌వర్క్‌‌ కలిగిన 500 ఇండిపెండెంట్ సెల్లర్లను ఫ్లిప్‌కార్ట్ హెల్త్‌ప్లస్ ప్లాట్‌ఫామ్ కనెక్ట్ కానుంది. దీంతో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ను ఆమోదించి.. ఆ  మందులను ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ వినియోగదారులకు అందించనుంది.

కరోనా మహమ్మారి తర్వాత.. భారతీయులు ఎక్కువగా హెల్త్ సర్వీసులపై ఫోకస్ చేస్తున్నట్లు ఫ్లిప్‌‌కార్ట్ హెల్త్ ప్లస్ సీఈవో ప్రశాంత్ జావేరి అన్నారు. ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై చూపిస్తున్న శ్రద్ధను అంతకుముందెన్నడూ చూడలేదన్నారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో దీన్ని కలపలేదని., దీనిని విడిగానే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ అప్లికేషన్ ఐఓఎస్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కస్టమర్లకు టెలికన్సల్టేషన్, ఈ-డయాగ్నోస్టిక్స్ వంటి ఇతర వాల్యు యాడెడ్ హెల్త్‌కేర్ సర్వీసులను అందించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

HUL Investment: హిందూస్తాన్‌ యూనిలివర్ ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితి ఏమిటంటే..

Inflation: ఇంధన ధరలతో చేటు.. సామాన్యుడికి ధరల పోటు.. ఇంకెన్నాళ్లు ఇలా..

Cooking Oil: వంటనూనె ధరలు ఇప్పట్లో దిగివస్తాయా? వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి..