AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న ప్రశాంత్ నీల్.. సలార్ నుంచి గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా ?..

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం కేజీఎఫ్ 2 (KGF 2). కన్నడ రాకింగ్ స్టార్ యష్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వస్తోన్న

Salaar: ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న ప్రశాంత్ నీల్.. సలార్ నుంచి గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా ?..
Salaar
Rajitha Chanti
|

Updated on: Apr 08, 2022 | 4:21 PM

Share

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం కేజీఎఫ్ 2 (KGF 2). కన్నడ రాకింగ్ స్టార్ యష్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వస్తోన్న ఈ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో సెన్సెషనల్ సృష్టించిన కేజీఎఫ్ సినిమాకు సిక్వెల్‏గా ఈ మూవీ తెరకెక్కడంతో కేజీఎఫ్ 2 మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదైలన ఈ మూవీ పోస్టర్స్… ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల రోజునే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు మరో స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడని టాక్. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం కేజీఎఫ్ ప్రదర్శిస్తోన్న అన్ని థియేటర్లలో సలార్ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తిక అప్డేట్ రివీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

కేజీఎఫ్ విడుదల రోజున థియేటర్లలో సలార్ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లుగా టాక్ నడుస్తోంది. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ ఆద్య పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమానే కాకుండా.. ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్​-కే , సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్‌ చిత్రాలు చేస్తున్నాడు.

Also Read: Manchu Vishnu: సన్నీ లియోన్‏ను చూసి భయపడి పారిపోయిన మంచు విష్ణు.. నెట్టింట్లో వైరలవుతున్న వీడియో..

Akira Nandan: అకీరాకు బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..

Ranbir Kapoor Alia Bhatt: బాలీవుడ్‏లో పెళ్లి భజాలు.. రణబీర్ కపూర్, అలియా పెళ్లికి అతిథులు వీరే..

Mahesh Babu: ఒకే రోజు 30 మందికి ప్రాణ దానం.. మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్‌..