Tax Issue: టాక్స్ చెల్లించని దిగ్గజ వ్యాపారి కుమార్తె.. ప్రజలపై భారీగా పన్నులు పెంచారంటూ ప్రతిపక్షాల విమర్శలు
Tax Issue: భారత ప్రఖ్యాత వ్యాపార వేత్త కుమార్తె ఆ దేశంలో టాక్స్ చెల్లించకపోవటం ఇప్పడు రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రజలపై మాత్రం ఎడాపెడా టాక్సులు విధిస్తున్నారంటూ ప్రతిపక్షాల మండిపడుతున్నాయి. ఇంతకీ పూర్తి వివరాలు ఏమిటంటే..
Tax Issue: బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ భార్య, ఇన్ఫోసిస్(Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె.. అక్షతా మూర్తి(Akshata Murthy) యూకే పన్ను ప్రయోజనాల కోసం నివాసం లేని వ్యక్తిగా పరిగణించబడుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై బ్రిటన్‌లోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అక్షత బ్రిటన్‌లో తొమ్మిదేళ్ల నుంచి నివసిస్తున్నప్పటికీ ఆమె ఇప్పటికీ భారత పౌరురాలే. అందువల్ల ఇన్ఫోసిస్‌లో తనకున్న 0.93% వాటా షేర్లను కలిగి ఉంది. వాటి నుంచి వచ్చే ఆదాయంపై అక్షత బ్రిటన్‌లో పన్నులు చెల్లించనక్కర్లేదు. భారత ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని ఆమోదించదు కాబట్టి ఆమె ఇప్పటికీ భారత్‌లో పన్నులు చెల్లిస్తున్నారు. లక్షలాది మంది ప్రజలపై ప్రభుత్వం ఎడా పెడా పన్నులు వేస్తుందని బ్రిటన్ పత్రికల్లో వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్ష లేబర్ పార్టీలో శాసనసభ్యుడు, ట్రెజరీ ప్రతినిధి తులిప్ సిద్ధిక్ రిషి సునక్ భార్య పన్ను హోదా నుంచి ప్రయోజనం పొందారో లేదో చెప్పాలని కోరారు.
దీనికి బదులిస్తూ.. భారతదేశ పౌరురాలిగా యూకే పన్ను ప్రయోజనాల కోసం అక్షతా మూర్తిని బ్రిటిష్ చట్టం ప్రకారం నాన్-డొమిసిల్డ్‌గా పరిగణిస్తున్నారని అక్షతా మూర్తి ప్రతినిధి వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రవేశించినప్పుడు 2020 ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునక్ ఇప్పుడు అత్యంత కఠినమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదలతో జీవన ప్రమాణాలు 1950 నాటి స్థాయికి పడిపోయాయి. బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవ, పబ్లిక్ ఫైనాన్స్‌ల పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు 1940ల నుంచి అత్యధిక స్థాయిలో పన్నులు పెంచినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
Zomato Food Delivery: జొమాటో 10 నిమిషాల ఇన్‌స్టంట్ సేవలపై కస్టమర్ల అపోహలు.. అసలు వాస్తవాలేంటంటే..
Stock Market: RBI ప్రకటనతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. రూ.247 కోట్లకు చేరిన ఇన్వెస్టర్ల సంపద..