AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 CSK vs SRH Head to Head: ఇరుజట్ల రికార్డుల్లో చెన్నైదే ఆధిపత్యం.. హైదరాబాద్‌కు మరోసారి ఓటమి తప్పదా..

గత సీజన్‌లో ఈ రెండు జట్లు కలిసి ఇప్పటివరకు 17 సార్లు తలపడ్డాయి. ఈ 17 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ జట్టు 4 సార్లు మాత్రమే గెలిచింది. అదే సమయంలో, చెన్నై జట్టు 13 మ్యాచ్‌లు గెలిచింది.

IPL 2022 CSK vs SRH Head to Head: ఇరుజట్ల రికార్డుల్లో చెన్నైదే ఆధిపత్యం.. హైదరాబాద్‌కు మరోసారి ఓటమి తప్పదా..
Csk Vs Srh Ipl 2022 Playing Xi
Venkata Chari
|

Updated on: Apr 08, 2022 | 4:43 PM

Share

ఐపీఎల్ 2022 (IPL 2022) లో చెన్నై సూపర్ కింగ్స్ శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల పరిస్థితి బాగా లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు మ్యాచ్‌లు, చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మూడు మ్యాచ్‌లు ఆడగా ఒక్కటి కూడా గెలవలేదు. శనివారం డివై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు బరిలోకి దిగిన తర్వాత, ఏదో ఒక జట్టు వరుస పరాజయాలకు ముగింపు పలకడం ఖాయం. అయితే ఏ జట్టు అనేది శనివారం తెలియనుంది. పేపర్లు, లెక్కల పరంగా చూస్తే.. గత ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా బలంగా కనిపిస్తోంది.

తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై జట్టు పరాజయం పాలైంది. అదే సమయంలో లక్నో సూపర్ జెయింట్‌తో ఓటమిని ఎదుర్కొంది. చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సీఎస్‌కేను ఓడించింది. చెన్నై జట్టు తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్‌లపై హైదరాబాద్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుదే ఆధిపత్యం..

లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పాల్గొంటున్నాయి. గతంలో హైదరాబాద్‌ను డెక్కన్ ఛార్జర్స్ అని పిలిచేవారు. 2014 నుంచి ఈ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా పిలుస్తున్నారు. గత సీజన్‌లో ఈ రెండు జట్లు కలిసి ఇప్పటివరకు 17 సార్లు తలపడ్డాయి. ఈ 17 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ జట్టు 4 సార్లు మాత్రమే గెలిచింది. అదే సమయంలో, చెన్నై జట్టు 13 మ్యాచ్‌లు గెలిచింది. ఇక గత సీజన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా చెన్నై సూపర్ కింగ్స్ పైచేయిగా నిలిచింది. గత సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు విజయం సాధించింది.

గత సీజన్‌లో జట్ల పరిస్థితి ఏమిటి?

షార్జా వేదికగా చివరిసారిగా ఇరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా 44 పరుగుల ఆధారంగా హైదరాబాద్ 134 పరుగులు చేసింది. సీఎస్‌కే తరపున జోష్ హేజిల్‌వుడ్ మూడు, డ్వేన్ బ్రావో రెండు వికెట్లు తీశారు. ఈ లక్ష్యాన్ని చెన్నై రెండు బంతుల్లోనే సులువుగా సాధించింది. జట్టులో ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ 45, ఫాఫ్ డు ప్లెసిస్ 41 పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో సురేశ్ రైనా అత్యధికంగా 434 పరుగులు చేశాడు. ఈసారి జట్టులో భాగం కాలేదు. అతని తర్వాత 413 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. ఈరోజు అభిమానులు ఆయన ఫినిషర్ ఇన్నింగ్స్‌ను మరోసారి చూడాలనుకుంటున్నారు. బౌలర్ల గురించి చెప్పాలంటే, డ్వేన్ బ్రావో 19 వికెట్లు తీసి ముందంజలో ఉన్నాడు.

Also Read: Korea Open 2022: సెమీ ఫైనల్స్ చేరిన పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్.. టైటిల్‌ వేటకు రెండడుగుల దూరంలోనే..

CSK vs SRH IPL 2022 Match Prediction: చెన్నైతో హైదరాబాద్ ఢీ.. బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?