Korea Open 2022: సెమీ ఫైనల్స్ చేరిన పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్.. టైటిల్‌ వేటకు రెండడుగుల దూరంలోనే..

కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు.

Korea Open 2022: సెమీ ఫైనల్స్ చేరిన పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్.. టైటిల్‌ వేటకు రెండడుగుల దూరంలోనే..
Korea Open 2022 Kidambi Srikanth And Pv Sindhu
Follow us

|

Updated on: Apr 08, 2022 | 4:01 PM

కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌(Korea Open 2022)లో భారత షట్లర్లు పీవీ సింధు(pv sindhu), కిదాంబి శ్రీకాంత్(kidambi srikanth) తమ తమ మ్యాచ్‌లలో విజయం సాధించి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, మూడో సీడ్ అయిన సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌పై 21-10, 21-16తో 17వ విజయాన్ని నమోదు చేసింది. తర్వాతి మ్యాచ్‌లో రెండో సీడ్ కొరియా ప్లేయర్ అన్ సెయుంగ్‌తో తలపడనుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో స్థానిక ఆటగాడు సోన్ వాన్ హోపై మూడు గేమ్‌ల తేడాతో గెలుపొందాడు.

గంటలోనే విజయం..

గతంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో, శ్రీకాంత్ తన శక్తివంతమైన, ఖచ్చితమైన షాట్‌తో కేవలం గంటకు పైగా జరిగిన క్వార్టర్స్‌లో సన్ వాన్ హోపై 21-12 18-21 21-12 తేడాతో విజయం సాధించాడు. ఈ కొరియా ఆటగాడిపై శ్రీకాంత్ రికార్డు 4-7గా ఉంది. అతను గతంలో మూడు సందర్భాల్లో ఓడిపోయాడు.

అయితే రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లోకి పునరాగమనం చేసిన సన్ వాన్ హోను వెనక్కి నెట్టి భారత ఆటగాడు శుక్రవారం మెరుగైన ప్రదర్శన చేశాడు. ఐదో సీడ్ శ్రీకాంత్ తర్వాతి మ్యాచ్‌లో మూడో సీడ్ ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీతో తలపడనున్నాడు.

బుసానన్‌ను ఈజీగా ఓడించిన సింధు..

మహిళల సింగిల్స్‌లో సింధు గత నెలలో జరిగిన స్విస్ ఓపెన్‌ ఫైనల్‌లో ఓడిన బుసానన్‌ను ఓడించడంలో ఇబ్బంది పడలేదు. థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి తొలుత 5-2తో ఆధిక్యంలోకి వెళ్లినా.. సింధు ఆ తర్వాత పట్టు బిగించింది.

11-7తో ఆధిక్యంలో ఉన్న సింధు ఎనిమిది పాయింట్లు సేకరిస్తూ గేమ్‌ను సులభంగా గెలుచుకుంది. రెండో గేమ్‌లో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇందులో సింధు 8-2 ఆధిక్యంతో థాయ్‌లాండ్ క్రీడాకారిణిని ఓడించింది.

Also Read: CSK vs SRH IPL 2022 Match Prediction: చెన్నైతో హైదరాబాద్ ఢీ.. బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?

IPL 2022: రిషబ్‌ పంత్‌ ఆటతీరుపై తీవ్ర విమర్శలు.. కెప్టెన్ అయ్యాక విఫలమవుతున్నాడు..!