Anhedonia: అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
Emotional Numbness: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. పని, కుటుంబం, స్నేహితులు, సౌకర్యాలు ఇలా అన్నీ ఉన్నవారు కూడా ఆనందంగా గడపలేకపోతున్నారు. వారిలో ఏదో తెలియని శూన్యత కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి అన్హెడోనియాకు దారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

జీవితంలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, చాలా మందికి ఆ పరిస్థితులు ఉండవు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆనందాన్ని ఆస్వాదించే సమయం కూడా ఉండటం లేదు. ఎప్పుడూ ఏదో ఒక పని లేదా ఆలోచనతో ఉండిపోతున్నారు. సమయానికి నిద్ర పోవడం, తినడం లాంటి చేయకపోవడంతో శరీరకంగా, మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారు. పని, కుటుంబం, స్నేహితులు, సౌకర్యాలు ఇలా అన్నీ ఉన్నవారు కూడా ఆనందంగా గడపలేకపోతున్నారు. వారిలో ఏదో తెలియని శూన్యత కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి అన్హెడోనియాకు దారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆనందాన్ని అనుభవించే సామర్థ్యం తగ్గడం లేదా ఆనందాన్ని కోల్పోవడంగా వర్గీకరించారు.
అన్హెడోనియా అంటే ఏమిటి..?
అన్హెడోనియా అంటే కేవలం విచారం కాదు.. ఇది మానసిక ఆరోగ్య పరిస్థితి. దీనిలో ఒక వ్యక్తి తనను తాను సంతోషపెట్టే వస్తువులను ఆస్వాదించలేడు. చాలా మంది వ్యక్తులు ఇష్టమైన ఆహారాలు, సంగీతం, ప్రయాణం లేదా ప్రియమైన వారితో సమయం గడపడం వంటివి ఆస్వాదించలేరు. ఈ క్రమంలోనే అన్హెడోనియా వస్తుంది. చాలా మంది దీనిని గుర్తించరు. అలసట లేదా మూడ్ బాగోలేదని అంటూంటారు. అన్హెడోనియా చాలా కాలంపాటు కొనిసాగితే.. దాన్ని విస్మరించడం మానసిక ఆరోగ్యానికి, వారి చుట్టూ ఉన్నవారికి కూడా హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్హెడోనియా లక్షణాలు
అన్హెడోనియాలో చాలా మంది పట్టించుకోని లక్షణాలు ఉండవచ్చు. ఇష్టమైన అభిరుచులపై ఆసక్తి కోల్పోవడం, శుభవార్తలకు కూడా సంతోషపడకపోవడం, సంబంధాలలో కనెక్ట్ కాకపోవడం, ప్రతిదాన్ని భారంగా తీసుకోవడం, రోజంతా తిమ్మిరిగా అనిపించడం. అన్హెడోనియాతో బాధపడుతున్న చాలా మంది విచారం లేదా ఆనందాన్ని అనుభవించరు. అయితే, అర్థం చేసుకోలేనంత వింత ఉదాసీనతను కలిగి ఉంటారు.
నిరాశ, చిరాకు..
అనేక అధ్యయనాల ప్రకారం.. అన్హెడోనియా తరచుగా నిరాశ, చిరాకుతో ముడిపడి ఉంది. అయితే, ప్రతి వ్యక్తి నిరాశకు గురికావడం సాధారణమే. ఈ సమస్యకు కొన్నిసార్లు దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, భావోద్వేగ విచ్ఛిన్నాలు లేదా స్థిరమైన ఒత్తిడి వల్ల సంభవించవచ్చు. అయితే, అన్హెడోనియాతో బాధపడుతున్న వ్యక్తులలో మాత్రం కాలక్రమేణా చిరాకు గణనీయంగా పెరుగుతుంది. అందుకే పరిస్థితి అదుపులో ఉండగానే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
