AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peanut: అంతా తూచ్‌.. పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే.. నిజంగా ఆ సమస్యలు వస్తాయా?

పేదవాడి బాదంగా పిలువబడే వేరు శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చూడ్డానికి చిన్నగానే ఉన్న పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీటిని తినే విషయంలో చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి. అదేంటంటే వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల దగ్గు వస్తుందని చాలా మంది నమ్ముతారు. కాబట్టి ఇందులో నిజమెంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Peanut: అంతా తూచ్‌.. పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే.. నిజంగా ఆ సమస్యలు వస్తాయా?
Water After Peanuts Myth
Anand T
|

Updated on: Jan 29, 2026 | 4:53 PM

Share

సాధారణంగా ఏవైనా తిన్న వెంటనే నీరు తాగడం చాలా మంది అలవాటు. అలానే పల్లీలు తిన్న తర్వాత కూడా చాలా మంది నీరు తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యవంతులైన వ్యక్తులు వేరుశనగ తిన్న తర్వాత నీరు తాగితే ఎలాంటి దగ్గు సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగకు దగ్గుతో నేరుగా సంబంధం లేదని వైద్యులు అంటున్నారు. వేరుశనగలో ప్రోటీన్, కొవ్వు అధికంగా ఉండటం వల్ల, వాటిని తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగడం వల్ల కొంతమందిలో ఉబ్బరం, గ్యాస్ లేదా అజీర్ణం వంటి సమస్యలు కనిపించొచ్చని అంటున్నారు. కానీ ఈ విధంగా నీరు తాగడం వల్ల శరీరానికి హాని జరగదు. దగ్గు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.

అయితే వేరుశెనగలు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతుంది. ఉప్పు కలిపి శనగలు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు సమస్యలు వస్తాయి. అలాగే, ఖాళీ కడుపుతో ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి సరైన సమయంలో మితంగా వేరుశెనగలు తినడం చాలా మంచిదని చెబుతున్నారు.

శీతాకాలంలో వేరుశనగల తినడం వల్ల ప్రయోజనాలు

శరీరానికి వెచ్చదనం, శక్తి: శీతాకాలంలో శరీరానికి ఎక్కువ శక్తి, వెచ్చదనం అవసరం. వీటిని అందించడంతో శనగలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వేరుశెనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి, ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచడంలో సహాయపడుతాయి. అంతేకాదు ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసటను తగ్గిస్తాయి. అందుకే శీతాకాలంలో వేరుశెనగలు తినడం చాలా మంది గొప్ప ఎంపికగా భావిస్తారు.

పుష్కలమైన ప్రోటిన్: వేరుశెనగలు అధిక-నాణ్యత గల కూరగాయల ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. అవి కండరాలను బలోపేతం చేయడానికి, శరీరంలోని దెబ్బతిన్న కణాలను పునర్నిర్మించడానికి సహాయపడతాయి. అలాగే, శీతాకాలంలో శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అవసరం కాబట్టి, తక్కువ ధరకు సులభంగా లభించే వేరుశెనగలు మంచి ఎంపిక అవుతాయి. జిమ్‌ వెళ్లే వారికి ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అందించబడినవి మాత్రమే.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే.. వీటిరి పాటించే ముందు నిపుణులను సంప్రదించండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.