AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: ఈ సింపుల్ ట్రిక్‌తో తెలిస్తే.. నల్లగా మారిన టీ జల్లెడను క్షణాల్లో మెరిసేలా చేయొచ్చు!

వంట పాత్రలకు పట్టుకున్న జిడ్డు మరకలను తొలగించడమనేది.. ప్రతి ఇంట్లో మహిళలకు ఉండే పెద్ద టాస్క్. ఇందు కోసం వారు యుద్దమే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంత రుద్దినా అవి వాటిపై ఉన్న మరకలు పోనేపోవు. టీ జల్లెడ కూడా అంతే.. అది నల్లగా మారిందంటే చాలూ దాని పడేసి కొత్తది కొనాలని చూస్తారు. కానీ మీరు ఈ కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడి మీ ఇంట్లో నల్లగా మారిన పాత్రలతో పాటు టీ జల్లెడను కూడా కొత్తదానిలా మెరిసేలా చేయొచ్చు . అదెలానో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Jan 29, 2026 | 4:32 PM

Share
మన దేశంలో ఛాయ్ ప్రియులు ఎక్కువా.. ఇంటిళ్లిపాదికి ఉదయం టీ తాగందే పొద్దు గడవదు. అందుకే చాలా మంది ఇళ్లలోనే టీ కాచుకుంటారు. ఈ టీని వడపోసేందుకు మొదట్లో బట్టలను వాడేది. మారుతున్న కాలంతో పాటు టీ జల్లెడలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిని ఎక్కువ రోజులు వాడిన తర్వాత అవి నల్లగా మారుతాయి. వాటి రంధ్రాలు మూసుకుపోయి. టీ పోసినా కొన్ని సార్లు కిందకు దిగదు. దీంతో వాటిని చాలా మంది పాడేసి కొత్తది కొంటారు.

1 / 5
కానీ కాస్త శ్రద్ధ పెట్టి దాన్ని ఇలా క్లీన్ చేస్తే.. మీరు కొత్తది కొనాల్సిన అవసరమే లేదు. ఉన్నదాన్నే కొత్తదానిలా తయారు చేయవచ్చు. అందుకోసం మీరు పెద్దగా డబ్బులు కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదు. కేవలం ఇంట్లో దొరికే వస్తువలతోనే టీ జల్లెడను శుభ్రంగా క్లీన్ చేయవచ్చు.

2 / 5
బేకింగ్ సోడా: మొండి మరకలను తరిమికొట్టడంతో బేకింగ్ సోడా, వెనిగర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి దీనితో మీరు స్టీల్ టీ జల్లెడను క్లీన్ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో నీటిని మరిగించి, దానిలో కాస్తా వెనిగర్, బేకింగ్ సోడా, కొద్దిగా గిన్నెలు కడిగే లిక్విడ్ బాగా కలపండి. తర్వాత టీ జల్లెడను ఆ నీటి మిశ్రమంలో కాసేపు నానబెట్టండి.

3 / 5
జల్లెడకు ఉన్న మురికి అంత వదులుతుంది. అప్పుడు జల్లెడను బయటకు తీసి ఇంట్లో వాడని ఒక టూత్‌ బ్రష్ తీసుకొని జల్లెడను మెల్లగా రుద్దండి. అప్పుడు అందులో ఇరుక్కుపోయిన టీపొడి, మొండి మరకలు కూడా వదిలిపోతాయి.

4 / 5
తర్వాత జల్లెడను ఒక తడిలేని కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడవండి. ఇలా చేస్తే నిమిషాల్లో టీ జల్లెడ కొత్తదానిలా మెరుస్తూ కనపడుతుంది. దీని వల్ల మీకు డబ్బు ఆదా అవ్వడం జరుగుతుంది.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

5 / 5