Hyderabad: ఇలాంటి డాక్టర్లతో జాగ్రత్త.. జ్వరం వచ్చిందని సూది వేశాడు.. కాసేపటికే నురగలు కక్కుకుంటూ..
హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుడి నిర్వాకం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జ్వరం వచ్చిందని వచ్చిన ఓ వ్యక్తికి.. ఏం ఇంజెక్షన్ ఇచ్చాడో ఏమో గానీ.. కాసేపటికే నురగలు కక్కుకుని చనిపోవడం కలకలం రేపింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఫిర్జాదిగూఢలో బుధవారం (జనవరి 28) రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుడి నిర్వాకం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జ్వరం వచ్చిందని వచ్చిన ఓ వ్యక్తికి.. ఏం ఇంజెక్షన్ ఇచ్చాడో ఏమో గానీ.. కాసేపటికే నురగలు కక్కుకుని చనిపోవడం కలకలం రేపింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఫిర్జాదిగూఢలో బుధవారం (జనవరి 28) రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఫీర్జాదిగూడలో ఉంటున్న పి.ఎల్లం (56) అనే వ్యక్తి జ్వరంతో బాధపడుతున్నాడు.. దీంతో అతని భార్య ఆర్ఎంపీ వైద్యుడు లునావత్ రూప్ సింగ్ దగ్గరకు తీసుకెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం లునావత్ రూప్ సింగ్ ఎల్లంకు రెండు ఇంజెక్షన్ లు ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ఎల్లం నోట్లో నుంచి నురగ వచ్చింది.. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.. దీంతో అతని భార్య తీవ్ర భయాందోళనకు గురై.. వెంటనే తన కుమారునికి సమాచారం ఇచ్చింది.
ఎల్లంకు నోటి నుంచి నురగలు అలాగే వస్తుండటంతో.. అతని బోడుప్పల్ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.. ఈ క్రమంలోనే.. ఎల్లం మరణించాడు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలను సేకరించారు. నకిలీ ఆర్ఎంపీ లునావత్ రూప్ సింగ్ ను అదుపులోకి తీసుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు దర్యాప్తులో రూప్ సింగ్‌కు ఎలాంటి వైద్య అర్హతలు లేవని తేలడంతో న్యాయస్థానంలో హాజరుపర్చి.. రిమాండ్‌కు తరలిలించారు.
తెలంగాణలో నకిలీ వైద్యుల నిర్వాకం తో గతంలో కూడా పలువరు ప్రాణాలు కోల్పోయారు. 2023లో హైదరాబాద్ ప్రాంతంలో ఒక నకిలీ డాక్టర్ తప్పుడు చికిత్సతో రెండు మరణాలకు కారణమై అరెస్టయ్యాడు. అతను ఎలాంటి డిగ్రీ లేకుండా క్లినిక్ నడుపుతూ ఉండేవాడు. మరో ఘటనలో 2024లో రంగారెడ్డి జిల్లాలో నకిలీ మందుల విక్రయంతో ముగ్గురు జ్వరం, ఇన్ఫెక్షన్‌తో మరణించారు.. డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఇటీవల 2025లో కుత్బుల్లాపూర్‌లో నకిలీ టాబ్లెట్లు విక్రయిస్తూ ఉన్న క్లినిక్‌పై దాడి చేయగా.. అక్కడ నాసిరకం మందులు రీలేబుల్ చేసి విక్రయిస్తున్నారని తేలింది. ఇప్పటికైనా వైద్య శాఖ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి.. నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
