Hyderabad: హైదరాబాద్‌లోని ఆ ప్రాంత వాసులకు గుడ్‌న్యూస్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే..
హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ప్రాంతవాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. స్థానికంగా ఉన్న ట్రాఫిక్ కష్టాలను చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.80.47 కోట్ల నిధులతో నేరేడ్‌మెట్ రైల్వే స్టేషన్ వద్ద ఆర్‌యూబీ, ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యతో స్థానిక ప్రజలు రైల్వే గేటు వద్ద నిమిషాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.

హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ప్రాంతవాసులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మల్కాజ్ గిరిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నేరెడ్‌మెడ్ రైల్వే స్టేషన్ వద్ద అండర్ పాస్ ఆర్‌యూబీ, ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. రూ.రూ.80.47 కోట్ల నిధులతో ఈ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మంగళవారం ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజేందర్‌రెడ్డి నేరేడ్‌మెట్ రైల్వే స్టేషన్ వద్ద ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రూ.74.47 కోట్ల వ్యయంతో ఆర్‌యూబీ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఇది మల్కాజిగిరి ప్రజల ఏళ్ల నాటి పోరాటానికి దక్కిన ఫలితమని ఆయన అన్నారు.దీనితో పాటు సఫిల్‌గూడ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు రూ.12.81కోట్లతో ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణం కూడా చేపట్టినట్టు స్పష్టం చేశారు.
ఇక మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసే విధంగా పనిచేస్తామన్నారు. రైల్వే శాఖ సమన్వయంతో( రోడ్ అండర్ బ్రిడ్జ్) ఆర్‌యూబీ, లిమిటెడ్ హైట్ సబ్‌వే (ఎల్‌హెచ్‌ఎస్) నిర్మాణ పనులు త్వరితగతినా పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్మాణాలు పూర్తయితే మల్కాజిగిరి ప్రజల ఏళ్ల నాటి పోరాటం ఫలించినట్టే అవుతుంది. వాళ్లు గంటల తరబడి రైల్వే క్రాసింగ్‌ల వద్ద వేచి చూడాల్సిన పని ఉండదు. అలాగే చాలా వరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
