రైళ్లలో వివిధ తరగతులు, వాటిలోని సౌకర్యాల ప్రాతిపదికగా టికెట్ ధరలను రైల్వే బోర్డు నిర్ణయిస్తుంటుంది. అందుకే దూరాన్ని బట్టి, ట్రైన్ బట్టి ధరలు రకరకాలుగా ఉంటాయి
TV9 Telugu
రైలు టికెట్ ధరలను నిర్ణయించే పద్ధతినీ, గిరాకీని బట్టి టికెట్ ధరలు పెంచడం, తగ్గించడం గురించీ, తత్కాల్ టికెట్లు అధికంగా ఉండటం గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయి
TV9 Telugu
ప్రయాణాలు చేయాలనుకునే వారు నెల రోజులు ముందుగానే రైలు టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటారు. అయితే ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల చివరి నిమిషంలో ప్రయాణం రద్దవుతుంది
TV9 Telugu
దీంతో టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఖరారైన రైల్వే టికెట్ రిజర్వేషన్ రద్దు చేసుకుంటే ఏ నిబంధనలు వర్తిస్తాయో మీకు తెలుసా..?
TV9 Telugu
రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్‌ను రద్దు చేసుకుంటే (కనీస రద్దు ఛార్జీ) ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.240, ఏసీ సెకండ్ క్లాస్‌కు రూ 200 చొప్పున రైల్వే మినహాయిస్తుంది
TV9 Telugu
ఇక థర్డ్ ఏసీ, ఏసీ ఛైర్‌కార్, థర్డ్ ఏసీ ఎకానమి రూ.180, స్లీపర్ క్లాస్ రూ.120, సెకండ్ క్లాస్ సిట్టింగ్‌కు రూ.60 డబ్బులను మినహయించుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు
TV9 Telugu
48 నుంచి 12 గంటల మధ్యన టికెట్ ఛార్జీ మొత్తంలో 25 శాతం మేరకు (కనీస రద్దు ఛార్జీ) డబ్బులు కట్ అవుతాయి. 12 నుంచి 4 గంటల మధ్య 50 శాతం డబ్బులను (కనీస రద్దు ఛార్జీ) మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి చెల్లిస్తారు
TV9 Telugu
4 గంటల తర్వాత రద్దు చేసుకుంటే టిక్కెట్ డబ్బులు తిరిగి ఇవ్వరు. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌లిస్ట్ టిక్కెట్లు రద్దు చేసుకుంటే అరగంట లోపు రూ. 60 మినహాయించుకుంటారు. తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వరు