ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ నెయ్యి తింటే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఇది అర్థరైటిస్ నొప్పులను తగ్గించడానికి నెయ్యి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కాల్షియం లోపం ఉన్న మహిళలు ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నెయ్యి ఖాళీ కడుపుతో తీసుకుంటే.. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా నిరోధిస్తుంది. ముడతలు, మచ్చలు, మొటిమలను తొలగిస్తుంది.

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. నెయ్యిలో కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్లు ఎ, డి, ఇ మరియు కె పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల మన శరీరంలోని రక్త నాళాల పనితీరు పెరుగుతుంది మరియు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నెయ్యిలోని పోషకాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అనేక మెదడు వ్యాధుల నుండి రక్షిస్తాయి. నెయ్యి జీవక్రియను మెరుగుపరుస్తుంది. చిన్న ప్రేగులు పోషకాలను బాగా గ్రహించడానికి తోడ్పడుతుంది.
నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తీసుకోవడం వల్ల ఎముకలు బలపడటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ముక్కు, గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తుంది. నెయ్యిలోని ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దృష్టి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుుంది. కంటి అలసట, కళ్లు పొడిబారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నెయ్యి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మెదడును హైడ్రేట్‌గా ఉంచుతుంది. తద్వారా అభిజ్ఞా విధులు, ఏకాగ్రతను పెంచుతుంది. అంతేకాకుండా, నెయ్యిలోని విటమిన్ ఇ మెదడు సమస్యల నుంచి రక్షిస్తుంది. ఖాళీ కడుపుతో తీసుకుంటే మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. అర్థరైటిస్ నొప్పులను తగ్గించడానికి నెయ్యి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కాల్షియం లోపం ఉన్న మహిళలు ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నెయ్యి ఖాళీ కడుపుతో తీసుకుంటే.. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా నిరోధిస్తుంది. ముడతలు, మచ్చలు, మొటిమలను తొలగిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..