AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరపడండి.. సీజన్‌ అయిపోయివచ్చింది..! బీపీ నుంచి షుగర్ వరకు బోడకాకరకాయ తినాల్సిందే…

బోడ కాకరకాయ ఇష్టపడని వారు ఉండరేమో. శాకాహారులే కాదు అందరూ ఇష్టం గా తినే ఈ కాయగూర పోషకాల గని. ఇమ్మ్యూనిటీ బూస్టర్. ఈ బోడ కాకరకాయలో అనేక పోషకాలున్నాయి. విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, ఇలా ఇందులో లేని విటమిన్ లేదంటే అతిశయోక్తి కాదు.

త్వరపడండి.. సీజన్‌ అయిపోయివచ్చింది..! బీపీ నుంచి షుగర్ వరకు బోడకాకరకాయ తినాల్సిందే...
boda kakara
Jyothi Gadda
|

Updated on: Oct 03, 2025 | 11:57 AM

Share

వర్షాకాలం అయిపోవచ్చింది. ఈ సీజన్‌లో మాత్రం దొరికే కొన్ని పండ్లు, కూరగాయలు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మనకు లభిస్తాయి. అలాంటి కూరగాయలలో ఒకటి బోడ కాకరకాయ. దీనిని ఆగాకార కాయ అని కూడా పిలుస్తారు. బోడ కాకర, ఆగకర, బొంత కాకర పేరు ఏదైనా దీని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. బోడ కాకరకాయ ఇష్టపడని వారు ఉండరేమో. శాకాహారులే కాదు అందరూ ఇష్టం గా తినే ఈ కాయగూర పోషకాల గని. ఇమ్మ్యూనిటీ బూస్టర్. ఈ బోడ కాకరకాయలో అనేక పోషకాలున్నాయి. విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, ఇలా ఇందులో లేని విటమిన్ లేదంటే అతిశయోక్తి కాదు.

బోడ కాకర తీసుకుంటే జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. దొరికినన్నీ రోజులు మీరు బోడ కాకరకాయ తింటే మీకు జుట్టు రాలడం ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. బోడ కాకరకాయలో ఉండే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ మీ చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. ముడతలు పడకుండా ఆపడానికి సహాయం చేస్తాయి. షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. బ్లడ్ లో చక్కర నిల్వలు తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వీలైతే తరచుగా ఆహారంలో భాగం చేసుకోండి

బీపీ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. ఈ సీజన్ లో తరచుగా తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలానే ఇందులో ఉండే యాంటీ కాన్సర్ ఏజెంట్లు కాన్సర్ రాకుండా ఆపడానికి సహాయం చేస్తాయి. ఆగాకరకాయ మంచి ఇమ్మ్యూనిటీ బూస్టర్. మీకు రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. వర్షాకాలం లో సీజనల్ వ్యాధుల భారిన పడకుండా కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో ఏమైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం తప్పనిసరి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..