ప్రకృతి ఇచ్చిన వరం కాకర ఆకులు.. ఈ సమస్యకు దివ్య ఔషధం.. ఎలా తీసుకోవాలంటే..
భారతీయులు ఉపయోగించే కూరాగాయాల్లో కాకర కాయ ఒకటి. అయితే కాకర కాయ చేదుగా ఉంటుంది కనుక ఎక్కువ మంది దీనిని తినడానికి ఇష్టపడరు. అయితే కాకరకాయ మధుమేహ నియంత్రణ సహా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఇస్తుంది. కాకరకాయ మాత్రమే కాదు కాకరకాయ ఆకులు కూడా అనేక ప్రయోజనాలు ఇస్తుందని తెలుసా.. కాకర ఆకులుమధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. దీనిని ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చు? తెలుసుకుందాం.

కాకరకాయ చేదుగా ఉంటుంది. అయితే ఇది ఔషధ గుణాలతో ప్రసిద్ధి చెందింది. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దాని ఆకులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కాకరకాయతో పాటు దీని ఆకులు చాలా కాలంగా ఆయుర్వేదంలో వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడుతున్నాయి. కాకరకాయ ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. అంచులు ముళ్ళు తరహాగా ఉంటాయి. చేదు రుచిని కలిగి ఉంటాయి. ఈ ఆకులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్నాయి. వివిధ రకాల వ్యాధుల చికిత్సలో సహాయపడుతున్నాయి.
మధుమేహాన్ని నియంత్రించడానికి కాకరకాయని వంటింటి చిట్కాలలో ఉపయోగిస్తారు. ఇది ఫైబర్, విటమిన్లు ఎ, సి సహా ఇతర పోషకాలకు మూలం. కానీ దీని ఆకులు కూడా ప్రయోజనకరం అని నిపుణులు చెబుతున్నారు.
నిపుణులు ఏమంటున్నారు? ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా కాకర ఆకుల ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడుతూ.. కాకరకాయ ఆకులు మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడతాయని వివరించారు. వీటిల్లో ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ కాకర ఆకుల రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపును శుభ్రపరచడంలో సహాయపడుతుంది. కాకరకాయ ఆకులను తీసుకోవడం వల్ల శరీరానికి ఐరెన్, ఫోలిక్ ఆమ్లం లభిస్తుంది. హిమోగ్లోబిన్‌ను పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కాకరకాయ ఆకులను రసం తయారు చేసుకుని తాగడం లేదా పచ్చిగా నమలడం చేయాలి.
కాకర ఆకుల రసాన్ని ఎలా చేసుకోవాలంటే 6 నుంచి 8 కాకరకాయ ఆకులను తీసుకుని బాగా కడిగి.. మిక్సీ గిన్నెలో వేసుకుని కొంచెం నీరు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాతా ఈ రసాన్ని వడకట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో పాటు.. హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ప్రత్యామ్నాయంగా కాకరకాయ ఆకులను నీటితో శుభ్రం చేసుకుని పచ్చిగా నమలవచ్చు. అయితే మితంగా తీసుకోవాలి. అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల లో షుగర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. గర్భిణీలు లేదా పాలిచ్చే మహిళలు వాటిని తీసుకునే ముందు నిపుణుడిని సంప్రదించాలి. రుచి చాలా చేదుగా అనిపిస్తుంటే.. తక్కువ పరిమాణంతో ప్రారంభించండి.
ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారం, జీవనశైలిపై శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఇంటి నివారణలు ప్రయోజనకరంగా ఉంటాయి. కాకరకాయ ఆకులు తీసుకునే ముందు నిపుణుడిని సంప్రదించండి. షుగర్ లెవెల్స్ ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. తినే ఆహారంవిషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి. సున్నితమైన యోగా, ప్రాణాయామం, సాగదీయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. డాక్టర్ సూచించిన మందులు లేదా ఇన్సులిన్‌ను సకాలంలో తీసుకోవడం కొనసాగించండి. ఒత్తిడి కూడా చక్కెర స్థాయిలను పెంచుతుంది. కనుక ఒత్తిడిని నియంత్రించుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








