AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాలకుల టీ రోజూ తాగుతున్నారా..? శరీరంలో జరిగేది ఇదే..! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారో తెలిస్తే..

టీలో యాలకులు వేసి తయారు చేయటం వల్ల టీ రుచి పెరుగుతుంది. అంతేకాదు, యాలకుల టీ ఘాటు, ఛాయ్ నుంచి వచ్చే వాసన సైతం ఇతరులను ఆకట్టుకునేలా ఉంటుంది. యాలకుల టీతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యాలకులతో కలిపిన టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు తొలగిపోతాయి. మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

యాలకుల టీ రోజూ తాగుతున్నారా..? శరీరంలో జరిగేది ఇదే..! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారో తెలిస్తే..
Cardamom Tea
Jyothi Gadda
|

Updated on: Oct 03, 2025 | 11:05 AM

Share

యాలకులు టీలో వేయడం వల్ల జీర్ణ ఎంజైమ్​ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. అలాగే యాలకుల టీ వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలను తగ్గిపోతాయి. కాలేయం, మూత్రపిండాలు పనితీరుకు సహకరిస్తుంది. అంతేకాకుండా యాలకులతో కలిపిన టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు తొలగిపోతాయి. టీలో యాలకులు వేయడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. దాని ఫలితంగా కేలరీల ఖర్చు పెరిగి బరువు అదుపులో ఉంటుంది. యాలకుల టీ వల్ల శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది.

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. టీలో యాలకులను జోడించడం ద్వారా శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఫ్రీ రాడికల్స్​తో పోరాడటానికి సహాయపడుతుంటాయి. యాలకులు సహజంగా మానసిక స్థితిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. యాలకులను టీలో వేసి మరిగించడం వల్ల సెరోటోనిన్, ఇతర మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. టీ నుంచి వచ్చే సువాసన ఒత్తిడి తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది.

టీలో యాలకులు వేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. యాలకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటాయి. దాంతో నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. టీలో యాలకులు వేయడం వల్ల శ్వాసను తాజాగా ఉంచడానికి, నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడానికి సహాయపడుతుంది. సినోల్ అనే పదార్థం నోటి దుర్వాసన, ఇతర ఇన్ఫెక్షన్లను ఉత్పత్తి చేసే బాక్టీరియాతో పోరాడుతుంది.

ఇవి కూడా చదవండి

శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడానికి యాలకులు ఉపయోగపడతాయి. అలాగే యాలకులు నేచురల్ డీకాంజెస్టెంట్​గా పనిచేస్తాయి. దాంతో దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు నివారించవచ్చు. గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. అంతేకాదు యాలకులు చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. హైబీపీతో బాధపడేవారు క్రమం తప్పకుండా యాలకులు టీ తాగడం మంచిది.

(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో ఏమైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం తప్పనిసరి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి పొద్దున్నే తాగే అలవాటు మీకూ ఉందా
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి పొద్దున్నే తాగే అలవాటు మీకూ ఉందా