AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం.. మహా అద్భుతం.. ఈ గ్రీన్ చట్నీ తింటే కొలెస్ట్రాల్‌ను కోసి తీసినట్లే.. ఎలా తయారు చేయాలంటే..

మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, దానిని నియంత్రించడానికి మీ ఆహారంలో ఆకుపచ్చ కొత్తిమీర చట్నీని తీసుకోవడం ప్రారంభించండి. ఎందుకంటే.. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి.. అలాగే.. కరిగించేందుకు సహాయపడుతుంది.. ఈ చట్నీ వల్ల కలిగే ప్రయోజనాలు.. అది ఎలా తయారు చేయాలి..? ఈ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకోండి..

అద్భుతం.. మహా అద్భుతం.. ఈ గ్రీన్ చట్నీ తింటే కొలెస్ట్రాల్‌ను కోసి తీసినట్లే.. ఎలా తయారు చేయాలంటే..
Green Chutney Recipe
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2025 | 3:45 PM

Share

సైలెంట్ కిల్లర్.. ఉరుకులు పరుగుల జీవితంలో కొలెస్ట్రాల్ సమస్య వేగంగా పెరుగుతోంది.. అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారం కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు.. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ గుండెజబ్బులతోపాటు.. ఎన్నో ప్రమాదకర వ్యాధులకు కారణమవుతుంది. వాస్తవానికి చెడు నూనెతో తయారు చేసిన వస్తువులు, జంక్ ఫుడ్, డబ్బాల్లో ఉన్న ఆహారం, చక్కెర పానీయాలు.. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి. ఇది ఊబకాయం, గుండెపోటు, అధిక రక్తపోటు, స్ట్రోక్ – అనేక ఇతర తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి, మీరు మొదట మీ ఆహారాన్ని మార్చుకోవాలి. మీరు ఈ గ్రీన్ చట్నీతో ప్రారంభిస్తే.. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడంతోపాటు.. నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పచ్చి కొత్తిమీర, వేయించిన పల్లీలతో తయారు చేసిన ఈ గ్రీన్ చట్నీ కొలెస్ట్రాల్ ను వేగంగా నియంత్రిస్తుందని.. పేర్కొంటున్నారు..

కొత్తిమీర చట్నీ కి కావలసిన పదార్థాలు..

2 గుప్పెళ్లు వేయించిన శనగలు, కప్పు కొత్తిమీర, 12-15 పుదీనా ఆకులు, 1 ఉసిరి, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, నల్ల ఉప్పు, అర టీస్పూన్ జీలకర్ర పొడి.. కావాలంటే.. మీరు తీసుకునే పదార్థాల పరిమాణాన్ని బట్టి మార్చుకోవచ్చు..

వేయించిన వేరుశనగల్లో ఉండే ఫైబర్ – యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే, కాల్చిన వేరుశనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ – ప్రోటీన్ అధికంగా ఉంటాయి.. కాబట్టి కాల్చిన వేరుశనలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.

అలాగే.. కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

దీంతోపాటు.. అల్లం, ఉసిరి, వెల్లుల్లి, జీలకర్రలోని పోషకాలు ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి.. వీటిలోని యాంటి ఆక్సిడెంట్లు, సహజ సిద్ధమైన ఔషధ గుణాలు కొలెస్ట్రాల్ ను కరిగించేందుకు సహాయపడతాయి..

వేయించిన శనగపప్పు – పచ్చి కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేయాలి?

మిక్సర్ జార్ లో వేయించిన శనగపప్పు, ఒక కప్పు కొత్తిమీర, 12-15 పుదీనా ఆకులు, 1 ఉసిరి, ఒక చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, అర టీస్పూన్ జీలకర్ర పొడి.. రుచికి సరిపడా నల్ల ఉప్పు తీసుకోండి. ఇప్పుడు అర కప్పు నీరు వేసి బాగా రుబ్బుకోండి. ఇలా రుచికరమైన.. ఆరోగ్యకరమైన చట్నీని మీరు టిఫిన్ తో పాటు.. అన్నంలో కూడా కలుపుకుని తినవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..