AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reverse Walking: రివర్స్ వాకింగ్ గొప్ప వ్యాయామం.. రోజూ 15 నిమిషాలు వెనక్కి నడిస్తే అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

నడక ఆరోగ్యానికి మేలు అన్న సంగతి తెలిసిందే.. అయితే నడకలో చాలా రకాలున్నాయి. వీటిల్లో ఒకటి రివర్స్ వాకింగ్. ప్రతిరోజూ కేవలం 15 నిమిషాలు రివర్స్ వాకింగ్ చేస్తే ఆరోగ్యంలో చాలా మార్పులు కనిపిస్తాయి, ఆ ఆరోగ్య ఫలితాలు శరీరంలో మొదలవడం గమనించిన తర్వాత ఆశ్చర్యపోతారు. రివర్స్ వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Reverse Walking: రివర్స్ వాకింగ్ గొప్ప వ్యాయామం.. రోజూ 15 నిమిషాలు వెనక్కి నడిస్తే అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
Reverse Walking Benefits
Surya Kala
|

Updated on: Aug 14, 2025 | 1:41 PM

Share

నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామాలలో ఒకటి. అయితే నడక కంటే రివర్స్ వాకింగ్ ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని మీకు తెలుసా..! అవును రివర్స్ వాకింగ్ శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రివర్స్ వాకింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.

శరీర భంగిమను మెరుగుపరుస్తుంది నేటి జీవనశైలిలో శారీరక శ్రమ చేయడం గణనీయంగా తగ్గిపోయింది. ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉంది. దీంతో చాలా మంది శరీర భంగిమను పాడు చేస్తుంది. రివర్స్ వాకింగ్ వెన్నెముకను నిటారుగా ఉంచుతుంది. భుజాలను వెనక్కి లాగుతుంది. ఇది భంగిమను మెరుగుపరుస్తుంది. ఇది వెన్నునొప్పి, మెడ నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

కీళ్ల, మోకాలి నొప్పి నుంచి ఉపశమనం సాధారణ నడకతో పోలిస్తే రివర్స్ వాకింగ్ లో మోకాళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మోకాలి కీళ్లను బలపరుస్తుంది. ఆర్థరైటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కీళ్ల వశ్యతను పెంచుతుంది. నొప్పిని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

సమతుల్యత మెరుగు వెనుకకు నడవడం వల్ల సమతుల్యత మెరుగుపడుతుంది ఎందుకంటే ఇది ప్రొప్రియోసెప్షన్‌ను బలపరుస్తుంది. ఇది ముఖ్యంగా వృద్ధులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పడిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కేలరీలను బర్న్ చేయడంలో సహాయం శరీరం కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. రివర్స్ వాకింగ్ సాధారణ నడక కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. దీంతో బరువు తగ్గడంలో రివర్స్ వాకింగ్ సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది.

కాళ్ళ కండరాలు బలోపేతం వెనుకకు నడవడం వల్ల కాళ్లలోని క్వాడ్రిసెప్స్, హామ్ స్ట్రింగ్స్, కాఫ్ కండరాలు ఉత్తేజితమవుతాయి. ఇది కాళ్ల బలాన్ని పెంచుతుంది. కనుక రివర్స్ వాకింగ్ అథ్లెట్లు, రన్నర్లకు కూడా గొప్ప వ్యాయామం.

మానసిక ఆరోగ్యానికి ప్రయోజనం రివర్స్ వాకింగ్ మనస్సును చురుగ్గా ఉంచుతుంది. ఎందుకంటే ఇలా నడిచే సమయంలో ఏకాగ్రత, శ్రద్ధ అవసరం. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.

ఏ విషయాలను గుర్తుంచుకోవాలంటే అయితే రివర్స్ వాకింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రారంభంలో నెమ్మదిగా.. జాగ్రత్తగా నడవాలి. తద్వారా శరీరం సమతుల్యతను కాపాడుకోగలదు. అలాగే వెనుకకు నడవడానికి సాధారణ అభ్యాసం కూడా చాలా ముఖ్యం.

రివర్స్ వాకింగ్ చేస్తున్న సమయంలో సరైన బూట్లు, సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి. తద్వారా నడకలో ఎటువంటి సమస్య ఉండదు. శరీరంపై ఎక్కువ ఒత్తిడి కలుగదు. రివర్స్ వాకింగ్ చేయాలనుకుంటే నెమ్మదిగా ప్రారంభించాలి. ఈ నడకకి శరీరం సర్దుబాటు అవ్వడానికి సమయం ఇవ్వండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..
W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..
ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు
ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు
అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు
అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..